వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరతారు అనుకున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆ లాంఛనాన్ని పూర్తి చేశారు. కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో ఆయన అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయకముందే.. ఆయన ఆ పార్టీలో ఉండరని నేతలు వ్యాఖ్యానించారు. చివరకు అదే జరిగింది. మోదుగుల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే లాంఛనాన్ని పూర్తి చేశారు.
ఇంతకీ మోదుగుల పోటీ ఎక్కడ నుంచి? అనేది ఇప్పుడు ప్రశ్న. ఈ విషయంలో క్లారిటీ లేదు. పలు నియోజకవర్గాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. నరసరావు పేట ఎంపీ సీటు నుంచి గుంటూరు ఎంపీ సీటు, సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటు, లేదా పొన్నూరు నుంచి అసెంబ్లీకి.. అనే టాక్ వినిపిస్తూ ఉంది.
పొన్నూరులో వైసీపీకి మోదుగుల అయితే బలమైన అభ్యర్థి అవుతారు అని జగన్ భావిస్తున్నారు అనేది ఒక టాక్. అక్కడ టీడీపీ వరసగా గెలుస్తూ ఉంది.ఈ నేపథ్యంలో మోదుగుల అక్కడ నుంచి ఢీ కొట్టేందుకు తగిన వ్యక్తి అవుతాడనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.
ఇక సత్తెనపల్లి విషయంలో కూడా మోదుగుల పేరు వినిపిస్తోంది. అయితే అంబటి అక్కడ నుంచి ఇన్ చార్జిగా ఉన్నారు. ఇక నరసరావుపేట ఎంపీ సీటు మోదుగులకు ఆటపట్టు అయినదే. ఇలాంటి నేపథ్యంలో అక్కడ నుంచి అనే టాక్ కూడా నడుస్తోంది. అక్కడ కూడా వైసీపీకి ఇన్ చార్జి ఉన్నారు.
మోదుగుల విషయంలో అధికారిక ప్రకటన ఏమీ లేకపోవడంతో.. ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే మోదుగుల మాత్రం గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సై అంటున్నారట. అక్కడ నుంచి పోటీ చేసి టీడీపీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ ను ఓడించి తీరతానని ఆయన సవాల్ విసిరారు.
మరి మోదుగులకు అక్కడ నుంచి అభ్యర్థిత్వం ఖరారు అయినట్టేనా? లేక మరో చోట నుంచి ఆయనను జగన్ బరిలోకి దించుతారా? అనే విషయాలపై అతిత్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.