అదేందో కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్త కొత్త సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. తాను ముచ్చట పడి పార్లమెంటు ఎంట్రన్స్ లో ఫోటోలకు ఫోజులిస్తే.. అది కాస్తా ఎటకారంగా మారిపోయింది. ఫోటోలకు ఫోజులివ్వటం బాబుకు అలవాటే అయినా.. అదెంత స్థాయిలో ఉందన్న విషయం పార్లమెంట్ పిక్ విషయంలో అందరికి అర్థమైపోయింది.
ఇదిలా ఉంటే.. హోదా సాధన పేరుతో నిత్యం మోడీ మీద ఇష్టం వచ్చినట్లుగా తెలుగులో మాట్లాడే చంద్రబాబు.. తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఇంగ్లిషులో కానీ హిందీలో కానీ దుమ్ము దులిపేలా మాట్లాడింది లేదు. ఆ మాటకు వస్తే హోదా గురించి ప్రస్తావించిందే లేదు. సింగడు వెళ్లి వచ్చాడన్న చందంగా బాబు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో.. ఎందుకు తిరిగి వచ్చారో ఆయనకు మాత్రమే అర్థమవుతుందేమో.
ఇలా తానేం చేస్తున్నానో తనకే అర్థం కానట్లుగా వ్యవహరించే బాబుకు.. ఆయన పార్టీ తమ్ముళ్లు మాత్రం క్లారిటీగా అడిగేస్తున్న ప్రశ్నలు ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. రాష్ట్రంలో 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయాన్ని తెచ్చి పెడతామని చెబుతున్నారని.. అదెలా సాధ్యమవుతుందో చెప్పాలంటూ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.
అమరావతిలో నిర్వహిస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చేపట్టిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మోదుగుల మాట్లాడుతూ.. ఒకవైపు పండించిన పంటల్ని నిల్వ ఉంచుకునేందుకు గోధాములు లేకుంటే రైతులకు రెట్టింపు ఆదాయం ఎలా వస్తుందో అర్థం కావటం లేదన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక సంబంధిత మంత్రిగారు తెగ ఇబ్బంది పడిపోయారు.
ఇది సరిపోదన్నట్లుగా అధికారపార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. పంట రుణం తీసుకునేందుకు బీమా కట్టించుకుంటున్నారు కానీ పంట దెబ్బ తింటే మాత్రం తిరిగి పరిహారం ఇవ్వటం లేదన్నారు. దీని కారణంగా చిన్న రైతులు తెగ ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్పారు. ఈ ప్రశ్నలకు మంత్రి సోమిరెడ్డి సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా.. తమ్ముళ్లు సంతృప్తి చెందినట్లుగా కనిపించలేదు.