టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై అతడి భార్య హసీన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన భర్తకు వేరే అమ్మాయిలతో ఎఫైర్ లున్నాయని, ఆ నేపథ్యంలోనే తనను వదులుకోవాలని చూస్తున్నాడని ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. తాజాగా, షమీ ఓ మ్యాచ్ ఫిక్సర్ అని, దుబాయ్ లోని ఓ పాక్ అమ్మాయి నుంచి అతడు డబ్బుకూడా తీసుకున్నాడని ఆమె చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. తనతోపాటు ఈ దేశాన్ని కూడా షమీ మోసగించాడని, ఇంగ్లండ్ కు చెందిన మహ్మద్ భాయ్ అనే వ్యక్తితో షమీ సంభాషించి ఆ డబ్బుతీసుకున్నాడని ఆమె తెలిపింది. ఒకవేళ షమీ నిజాయితీపరుడైతే...ఆ డబ్బు ఎందుకు తీసుకున్నాడో వివరణ ఇవ్వాలని కోరింది. తన దగ్గర షమీ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది. షమీ, అతడి కుటుబం సభ్యులు తనను వేధిస్తున్నారని ఆమె కోల్ కతా కమిషనర్ కు గురువారం నాడు లిఖిత పూర్వక ఫిర్యాదునిచ్చింది.
తనతో పెళ్లికి ముందే షమీకి అతడి బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తోందని, వారి పెళ్లికి ఆమె కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యాయత్నం కూడా చేశాడని ఆమె తెలిపింది. ఆ తర్వాత కూడా అతడు పాక్, దుబాయ్ లకు చెందిన పలువురు యువతులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని తెలిపింది. కోహ్లీ లాగే తాను కూడా.....ఓ బాలీవుడ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని షమీ కోరికని, అందుకే తనను వదిలించుకోవాలని విడాకులు కోరుతూ వేధిస్తున్నాడని ఆరోపించింది. గతనెల సఫారీ పర్యటన అనంతరం అతడు ఇంటికి రాలేదని, ఓ హోటల్ లో వేరే యువతితో చెక్ ఇన్ అయినట్లు తనకు తెలిసిందని చెప్పింది. ఆ విషయాలపై తాను నిలదీస్తే ఏం చేసుకుంటావో చేసుకో మని బెదిరించాడని తెలిపింది.
మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలను షమీ ఖండించాడు. కావాలని తనపై కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తోందని ఆరోపించాడు. రెండేళ్లుగా తాను వేధిస్తుంటే....మీడియాకు ఎందుకు చెప్పలేదని అతడు ప్రశ్నించాడు. సఫారీ పర్యటన అనంతరం తామిద్దరం హోలీ చేసుకున్నామని, హఠాత్తుగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలని ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదని ఆరోపించాడు. తన మామతో ఫోన్ లో మాట్లాడానని తెలిపాడు. ఒకవేళ ఆ ఆరోపణలు నిజమైతే ఏ శిక్షకైనా తాను సిద్ధమని ,తన భార్యకు, అభిమానులకు బహిరంగ క్షమాపణలు కూడా చెబుతానని షమీ అన్నాడు.