మోహన్ బాబును తలసాని తిట్టాడా? పొగిడాడా?

Update: 2021-10-16 12:51 GMT
‘మా’ కార్యవర్గం ప్రమాణ స్వీకారం వేళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు జరిగింది. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జ్యోతి ప్రజ్వళన చేసి ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం తలసాని ‘మా’ ఎన్నికల రచ్చపై హాట్ కామెంట్స్ చేశారు. ‘అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో ‘మా’ ఎన్నికలు జరిగాయని.. ‘మా’ అసోసియేషన్ అంటే చిన్న అసోసియేషన్ కాదని.. పెద్ద వ్యవస్థ’ అని చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో మోహన్ బాబుకు కోపం, ఆవేశం ఎక్కువని అందరూ అనుకుంటారు. తప్పును తప్పు అని ధైర్యంగా మోహన్ బాబు చెబుతాడని తలసాని కీలక వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు కోపం ఆయనకే నష్టం చేసిందని.. ఇతరులకు కాదంటూ బాంబు పేల్చారు.

మోహన్ బాబు మంచు విష్ణుకు చదువు, సంస్కారం, క్రమశిక్షణ నేర్పారని తలసాని కొనియాడారు. ‘మా’ ఎన్నికకు 10 రోజుల ముందే ఫోన్ చేసి మంచు విష్ణు గెలుస్తారని చెప్పా.. సినీ పరిశ్రమ తలుచుకుంటే 900 కాదు.. 9వేల మందిని నడిపించుకోవచ్చని తలసాని హితవు పలికారు.

చిత్రపురి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం చేశామని.. సమష్టిగా మా ను ముందుకు తీసుకెళ్లండని తలసాని హితబోధ చేశారు.  అర్హులైన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూస్తామన్నారు.
Tags:    

Similar News