చంద్రబాబు - మోహన్ బాబు భేటీ!

Update: 2016-09-11 04:17 GMT
అనుకుంటాం కానీ.. కొన్ని కలయికలు, భేటీలు కొత్త కొత్త సంచలనాలకు తెరతీస్తుంటాయి. రెగ్యులర్ గా కలవని వాళ్లు, కాస్త భిన్నదృవాలుగా ఉండేవాళ్లు ఒక్కసారిగా భేటీ అయితే.. ఏదో జరగబోతుంది అనే సంకేతాలు వస్తుంటాయి. అయితే ఇలాంటి భేటీ ఒకటి శనివారం చోటుచేసుకుంది. అదే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సినీ హీరో మోహన్ బాబు భేటీ అవ్వడం. లేక్ వ్యూ క్యాంప్ కార్యాలయానికి తన కూతురు మంచు లక్ష్మితో వచ్చిన మోహన్ బాబు, చంద్రబాబు ని మర్యాదపూర్వకంగా కలిశారు.

అయితే ఇది కేవలం మర్యాద పూర్వకంగా కలిసిన కలయికేనా? లేక.. ఏదైనా సంచలనాలకు పునాదా అనేది తెలియాల్సి ఉంది. పైగా ప్రత్యేక హోదా కోసం ఏపీలో భారీ పోరు జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే.. తనకు క్రమశిక్షణ లేదని పార్టీ నుంచి తనను తీసేశారని చెప్పే మోహన్ బాబు.. తర్వాతి కాలంలో చంద్రబాబుపై తన ఇంటర్వుల్లో తనదైన స్టైల్లో సెటైర్స్ వేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఈ మధ్యకాలంలో అన్న గారి తర్వాత అంత గొప్ప ముఖ్యమంత్రి కేసీఆరే అని మోహన్ బాబు కితాబివ్వడం కూడా తెలిసిందే.

అయితే ఈ భేటీ వెనక పెద్ద సంచలనాలు ఏమీ ఉండకపోవచ్చని.. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి తన జన్మదినోత్సవం సందర్భంగా మోహాన్ బాబు కు ఈనెల 17న విశాఖలో "నవరస నట తిలకం" బిరుదు ప్రదానం చేయనున్న కార్యక్రమానికి.. తనవైపు నుంఛి ముఖ్యమంత్రిని ఆహ్వానించడానికి మోహన్ బాబు వెళ్లి ఉంటారని పలువురు భావిస్తున్నారు.
Tags:    

Similar News