మంచుల‌క్ష్మీకి ఘాటు కౌంట‌ర్‌ ఇచ్చిన కాంగ్రెస్

Update: 2017-07-21 16:41 GMT
అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మధ్య మొద‌లైన ట్విట్ట‌ర్ వార్ ముదిరిపాకాన ప‌డుతోంది. డ్రగ్స్ మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్ర‌చారం చేప్తుండ‌గా.. ఈ విష‌యంలో అధికార పార్టీ నేత‌ల‌కు సంబంధం ఉంద‌ని  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి దిగ్విజయ్‌ సింగ్ ఆరోపించారు. దీనికి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ``దిగ్విజయ్‌ సింగ్ గారు మీరు విచక్షణ కోల్పోయారు. తమరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మీ వయసుకు తగిన పని చేసుకోండి. ఇప్పటికైనా తెలంగాణ పదాన్ని సరిగ్గా పలుకడం నేర్చుకున్నందుకు సంతోషం`` అంటూ రీట్వీట్ చేస్తూ చురకలంటించారు. ఈ ఎపిసోడ్‌ లోకి మంచుల‌క్ష్మీ ఎంట‌ర‌య్యారు.

కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన ట్వీట్లకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ రీట్వీట్లు చేయడాన్ని సినీ నటుడు మోహన్‌ బాబు కుమార్తె మంచు లక్ష్మి సమర్థించారు. ఈ ప‌రిణామంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి స్పందించారు. మంచు ల‌క్ష్మీ తీరును తెలియ‌జెప్పేందుకు ఆమె తండ్రి మోహన్‌ బాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. మంచు లక్ష్మికి రాజకీయాలు ఎందుకని పొంగులేటి ప్రశ్నించారు. కాగా, లక్ష్మీ ఆ విధంగా సమర్థించకుండా ఉండాల్సిందని మోహన్‌ బాబు ప్రతిస్పందించారని పొంగులేటి వివ‌రించారు.

మ‌రోవైపు డ‌్ర‌గ్స్ కేసులో మూడో రోజు సిట్ విచార‌ణ ముగిసింది. నోటీసులందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుబ్బ‌రాజు ఇవాళ సిట్ ముందు హాజ‌ర‌య్యారు. దాదాపు 7 గంట‌ల పాటు ఆయ‌న‌ను సిట్ విచారించింది. కెల్విన్ తో ఉన్న సంబంధాల‌పై సుబ్బ‌రాజును ప్ర‌శ్నించింది సిట్. గ్రేటర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని బార్లు - ప‌బ్ ల ఓన‌ర్లు - మేనేజ‌ర్ల‌తో రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు సిట్ ప్రత్యేక స‌మావేశం అవ‌నుంది. ఇక‌.. నాలుగో రోజు శ‌నివారం న‌టుడు త‌రుణ్ సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌వనున్నాడు. నోటీసులు ఇచ్చిన తేదీ ప్ర‌కారమే ముమైత్ ఖాన్ కూడా హాజ‌ర‌వ‌నున్న‌ట్లు సిట్ ప్ర‌క‌టించింది.
Tags:    

Similar News