బాబుకు వ్యతిరేకంగా ఇటీవలే వైసీపీలో చేరిన నటుడు, నిర్మాత మోహన్ బాబు తన దూకుడును పెంచారు. ఇప్పటికే ప్రెస్ మీట్లతో బాబును హడలెత్తించిన మోహన్ బాబు ఇప్పుడు ఏపీలో వైసీపీ తరుఫున ఎన్నికల ప్రచారంలోకి కూడా దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన మోహన్ బాబు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘కాళ్లు కడిగి కన్యాదానం చేసిన ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.. అలాంటి చంద్రబాబును ఓడించండి’ అంటూ మోహన్ బాబు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లోనే టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని.. అన్న ఎన్టీఆర్ ను మోసం చేసిన శాపం ఈ ఎన్నికల్లో తగులబోతోందని మోహన్ బాబు మండిపడ్డారు.
పోలవరం లెక్కలు అడిగితే చెప్పని బాబు.. తన అబ్బ మొగుడి సొమ్ము అని అనుకుంటున్నాడా అని మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబు లాంటి వ్యక్తిని వేరే దేశంలో ఉరితీశేవారన్నారు. కనీసం మాట్లాడడం రాని కొడుకు లోకేష్ కు మూడు మంత్రి పదవులు కట్టబెట్టడం సమంజసమా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు, మంత్రులు ఇన్నాళ్లు ఇసుక, మట్టి దోచుకొని లక్షల కోట్లు వెనకేసుకున్నారని.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల రక్తం పీలుస్తారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గాలి వీస్తోందని మోహన్ బాబు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ 130 స్థానాల్లో విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. వైఎస్ జగన్ కేసులు సరే.. మరి తనకున్న 11 కేసుల గురించి బాబు ఎందుకు మాట్లాడడం లేదని మోహన్ బాబు విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే పారిపోయి ఏపీకి వచ్చారని చంద్రబాబుపై నిప్పులు కురిపించారు. ఇలా చంద్రబాబుపై మాటల తూటాలతో మోహన్ బాబు వేసిన పంచులు టీడీపీ శిబిరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.