కలలో కూడా ఊహించలేని విషయాన్ని సింఫుల్ గా నోటితో అనేశారు. భవిష్యత్తు మాటేమో కానీ.. ఇప్పటికైతే అది ఆలోచనలోనూ అసాధ్యం. ఏపీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాట కలలో కూడా ఎవరూ అనుకోరేమో. కానీ.. అలాంటి విషయాన్ని ఒక ముఖ్య కార్యక్రమంలో ఒక ప్రముఖుడు అనేయటం ఒక్కసారి అందరిని ఆశ్చర్యానికి గురిచేసినా .. ఆ పొరపాటుకు అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకునే పరిస్థితి.
తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ ను గురువారం ప్రతిష్ఠాత్మకంగా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. వీరిలో నాస్కామ్ తెలంగాణ చాఫ్టర్ ఛైర్మన్ మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. వేదిక మీద లేని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రస్తావిస్తూ... ‘‘ఏపీ ముఖ్యమంత్రి కేసీఆర్’’ అని అనటంతో సభలోని వారంతా ఒక్కసారి నవ్వేసిన పరిస్థితి. తన తప్పును అర్థం చేసుకున్న ఆయన ఈ ఇష్యూను సింపుల్ గా స్కిప్ చేసేశారు. రాష్ట్రం విడిపోయినా.. ఇంకా ఏపీ అన్న ఆలోచనలో ఉన్నారా? లేక.. ఏపీకి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? లాంటి వ్యాఖ్యలు సభలో వినిపించాయి.