ఆ స్కూల్లో ఎప్పటిలానే టెన్త్ క్లాస్ పిల్లలకు ఎగ్జామ్ పెట్టారు. క్లాస్ విద్యార్థులంతా పరీక్ష రాసేసి.. పేపర్లు టీచర్ చేతికి ఇచ్చారు. ఆన్సర్ షీట్లు చెక్ చేస్తున్న టీచరమ్మకు షాక్ తగిలింది. ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి రాసిన రాతలు వెంటనే స్కూల్ ప్రిన్సిపల్ దృష్టికి వెళ్లటమే కాదు.. ఆ చిన్నారి అనుభవించిన ఆవేదన.. నరకం వారిని కదిలించేశాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు ఇద్దరు దుర్మార్గుల్నిఅదుపులోకి తీసుకున్నా. సంచలనం సృష్టించిన ఈ ఉదంతం గుర్ గ్రామ్ లో చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
బాద్ షాపూర్ కు చెందిన 15 ఏళ్ల బాలిక టెన్త్ క్లాస్ చదువుతోంది. ఈ మధ్యన ఆమెకు బంధువయ్యే 23 ఏళ్ల కుర్రాడు.. మరో చిన్న అబ్బాయితో కలిసి ఆమెపై లైంగి దాడికి పాల్పడ్డాడు. జరిగిన దారుణం గురించి ఎవరికి చెప్పుకోవాలి? ఎలా చెప్పుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. ఇదిలా ఉండగా.. అంతలోనే స్కూల్ యూనిట్ పరీక్షలు వచ్చాయి. పరీక్షలో ఆమె తన మనసులోని వేదననంతా ఆన్సర్ షీట్లో రాసేసింది.
పేపర్లను కరెక్షన్ చేసే క్రమంలో సదరు చిన్నారి రాసిన పేపర్లను చూసి అలెర్ట్ అయ్యారు. ఆమె ఆవేదనకు స్కూల్ యాజమాన్యం కదిలిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ బాలిక రాసిన ఆన్సర్ షీట్ ను చూసి కదిలిపోయారు. వెంటనే కేసు నమోదు చేసి.. నిందితుల్ని గుర్తించారు. వారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకడు 23 ఏళ్ల కుర్రాడైతే.. మరొకడు బాధితురాలికి అన్న వరుస అవుతాడని గుర్తించి అవాక్కు అయ్యారు. బాధితురాలి తల్లి.. నిందితుడి తల్లి ఇద్దరూ సొంత అక్కా చెల్లెళ్లుగా గుర్తించారు. ఇంతకంటే దారుణం.. అన్యాయం ఇంకేమైనా ఉంటుందా?