ఒక అరు అంతస్తుల భవనం మీద నుంచి రూ.2వేల నోట్ల కట్టలు వర్షం మాదిరి కింద పడిన వైనం సంచలనంగా మారింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా నగరంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. ఎందుకిలా జరిగిందన్న విషయంలోకి వెళితే డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు జరిపిన ఆకస్మిక దాడులతో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
సెంట్రల్ కోల్ కతాలోని బిజినెస్ జిల్లా బెంటిక్ స్ట్రీట్ లోని ఆరు అంతస్తుల భవనంలో ఉన్న ఒక వాణిజ్య సంస్థ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇదే సమయంలో సంస్థలోని ఒక కిటికీ నుంచి కొందరు వ్యక్తులు రూ.2వేల నోట్ల కట్టలు కిందకు విసిరేశారు. దీంతో.. భవనం పై నుంచి నోట్ల వర్షం పడుతుండటంతో అక్కడి వారి హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇదిలా ఉంటే.. భవనం మీద నుంచి పడిన రూ.2వేల నోట్ల వర్షానికి అధికారుల ఆకస్మిక తనిఖీలకు సంబంధం లేదని డీఆర్ఐ అధికారులు చెబుతున్నా.. మరి ఏ కారణంతో ఈ నోట్ల వర్షం కురిసిందన్న విషయాన్ని చెప్పలేకపోతున్నారు. మొత్తంగా ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది