కరోనా మహమ్మారి తొలగిపోయిందనుకుంటే మంకీ పాక్స్ వెంటాడుతోంది. ఇప్పటికే దాదాపు 20 దేశాల్లో వ్యాపించిన ఈ వైరస్ తాజాగా భారత్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నగరంలో ఐదేళ్ల బాలికకు మంకీపాక్స్ సోకిందన్న అనుమానంతో అక్కడి వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
ఓవైపు కరోనా మరోసారి కోరలు చాస్తుంటే.. మరోవైపు మంకీ పాక్స్ వైరస్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇప్పటికే పలు దేశాలను వణికిస్తున్న ఈ వైరస్ మన దేశంలో అడుగుపెట్టకుండా కేంద్ర సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ తాజాగా.. ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్లో ఐదేళ్ల బాలికకు మంకీపాక్స్ సోకిందన్న అనుమానం అక్కడి వైద్యుల్లో కలిగింది. దీంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
బాలికకు మంకీపాక్స్ సోకిందనే అనుమానంతో పరీక్షల నిమిత్తం ఆమె నమూనాలను సేకరించినట్లు ఘజియాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. సాధారణంగా ఫ్లూ, కణాల వాపుతో మొదలై.. తర్వాత ముఖం, శరీరంపై దద్దుర్లు వస్తాయని చెప్పారు.
ప్రస్తుతం బాలికలో ఈ లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆమె పరీక్ష రిపోర్టు వచ్చిన దానిబట్టి ఆమె కుటుంబ సభ్యులకు, ఇంటి చుట్టు పక్కల వారికి కూడా నిర్ధరణ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు.
అయితే బాలికకు ఈ వైరస్ ఎలా సోకిందనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. గత నెల రోజుల నుంచి బాలికకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏవీ లేవని.. ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహుతులు, బంధువులు ఎవరు కూడా ఇతర దేశాలకు వెళ్లలేదని.. అక్కణ్నుంచి రాలేదని తెలిపారు.
పరీక్షల నివేదిక వస్తే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. బాలికలో మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తున్నాయనే విషయం తెలిసి ఘజియాబాద్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.