భూమిని కాపాడింది చందమామేనట.. బయటకొచ్చిన కొత్త నిజం

Update: 2020-10-17 08:30 GMT
శాస్త్ర పరిశోధనల్ని లోతుగా అధ్యయనం చేయటం ద్వారా ఆసక్తికర అంశాలు ఎన్నో బయటకు వస్తుంటాయి. ఆ కోవకు చెందిన ఒకఅంశం తాజాగా బయటకు వచ్చింది.అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసాకు చెందిన పరిశోధకులు కొత్త విషయాన్ని గుర్తించారు. చంద్రుడి మీద నుంచి సేకరించిన కొన్ని శాంపిల్స్ ను అధ్యయనం చేసి.. లోతుగా విశ్లేషించటం ద్వారా కొత్త విషయాలు బయటకు వచ్చాయి. సదరు రిపోర్టులోని అంశాల్ని చూస్తే.. ఈ రోజున భూమి ఇలా ఉందంటే కారణం.. అది చంద్రుడి పుణ్యమేనట.

నిజానికి చంద్రుడే లేకుంటే సముద్రాల్లో అలలు రాకపోవటమే కాదు.. లోకం మొత్తం స్తంభించినట్లు అయిపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా వెలువడిన రిపోర్టు ప్రకారం.. 350 కోట్ల సంవత్సరాల క్రితం భూమిని చందమామ సేవ్ చేశారట. అప్పట్లో భూమి ఇప్పటి మాదిరి ఉండేది కాదు. అప్పుడప్పుడే భూమి తయారవుతున్న వేళలో.. సూర్యడి నుంచి భూమి మీద పడే సోలార్ రేడియేషన్ కిరణాల నుంచి భూమిని చంద్రడు కాపాడినట్లుగా పేర్కొన్నారు.

అప్పట్లో సూర్యుడి నుంచి వచ్చే గాలులు అత్యంత ప్రమాదకరంగా ఉండేవట. అవి కానీ నేరుగా భూమి మీద పడి ఉంటే.. మానవాళి మీద ప్రాణకోటికి అవకాశమే ఉండేది కాదట. చందమామపై ఒకప్పుడు పవర్ ఫుల్ మాగ్నెటిక్ ఫీల్డ్ ఉండేదట. బూమి చుట్టూ ఉన్న ఈ అయస్కాంత క్షేత్రం వల్లే యూరోపియన్ దేశాలు.. ఆర్కిటిక్.. అంటార్కిట్ ధ్రువాల్లో ఆకాశం భిన్నంగా కనిపించటానికి కారణంగా చెబుతున్నారు.

సోలార్ రేస్ ను చందమామ అడ్డుకొని ఉండకపోతే.. భూమి మీద జీవకోటి సాధ్యమయ్యేది కాదు. అదే జరిగితే మిగిలిన గ్రహాల మాదిరి భూగ్రహం కూడా ఉండేదన్న వాదన వినిపిస్తోంది. సూర్యుడికి భూమికి మధ్యన చందమామ ఉండటంతో.. ఈ రోజున ఇలాంటి ఆవాసయోగ్యమైన వాతావరణం కచ్ఛితంగా చందమామ పుణ్యమే. ఈ కొత్త విషయాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు ఇప్పుడు .. చంద్రమామ మీద అయస్కాంత క్షేత్రం ఎలా మాయమైందన్న విషయం మీద అధ్యయనం చేస్తున్నారు. దీంతో మరిన్ని కొత్త విషయాలు బయటకు వచ్చే వీలుంది. ఇదంతా చదివాక.. చంద్రుడ్ని మనోళ్లు చంద‘మామ’ అనటం అతికినట్లుగా అనిపించట్లేదు.
Tags:    

Similar News