ఇటీవలే మంత్రి పదవులను వదులుకొని వైసీపీ రాజ్యసభ ఎంపీగా మారిన మోపిదేవి వెంకటరమణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎంపీ మోపిదేవితోపాటు ఆయన కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో ఉన్నారు. అయితే తృటిలో వారంతా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లేది.
విశాఖ జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద మోపిదేవి వెళ్తున్న కాన్వాయ్ లో ముందు వెళ్తున్న వాహనం సడన్ గా బ్రేక్ వేయడంతో కార్లు ఢీకొన్నాయి.
అదే సమయంలో వెనకనే వచ్చిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి వాహనంలో ఎంపీ మోపిదేవి.. ఆయన కుటుంబ సభ్యులు విశాఖకు వెళ్లారు.