తోక జాడిస్తే మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్

Update: 2017-01-04 09:30 GMT
పాకిస్థాన్ కు మన ఆర్మీ చీఫ్ గట్టి హెచ్చరికలు చేశారు.  ఎక్స్ ట్రాలు చేస్తే మరోసారి సర్జికల్ స్ర్టయిక్సు తప్పవని అన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌ లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోని టెర్రరిస్టు లాంచ్‌ ప్యాడ్లపై మెరుపుదాడి చేసిన విధంగా మరోసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేపడతామని ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ వార్నింగ్ ఇచ్చారు.
    
ఏ క్షణమైనా అవసరమైతే  ఎల్‌ వోసీ వెంబడి ఉన్న  ఉగ్రస్థావరాలపై మరోసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌ కు దిగుతామని ఆయన హెచ్చరించారు. సెప్టెంరబ్‌ 29నాటి సర్జికల్‌ స్ట్రైక్స్‌ వ్యూహకర్తల్లో ఒకరైన రావత్‌.. ఆర్మీ డిప్యూటీ చీఫ్‌ హోదాలో నాటి దాడుల ఆపరేషన్‌ ను స్వయంగా పరిశీలించారు. పాకిస్థాన్‌ కు దిమ్మతిరిగేలా నిర్వహించిన తొలి సర్జికల్‌ స్ట్రైక్స్‌ గురించిన పలు విషయాలనూ జనరల్‌ రావత్‌ వెల్లడించారు. ‘పాక్‌ సైన్యం నుంచి శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్‌ లోకి ప్రవేశించడానికి సిద్దంగా ఉన్న ఏడు లాంచ్‌ ప్యాడ్లను టార్గెట్‌ చేశామని.. ఇందుకోసం బృహత్‌ ప్రణాళిక రచించించి పకడ్బందీగా అమలుచేశామని చెప్పారు. ‘‘మన సైనికుల సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తూనే భీకర దాడులు చేపట్టాం. అది రియల్‌ టైమ్‌ ఆపరేషన్‌ కాబట్టి బేస్‌ క్యాంపుల నుంచి ఆదేశాల జారీ కూడా అంతే త్వరగా జారీ అయ్యాయి. ఎల్‌ వోసీ నుంచి 2కిలోమీటర్ల దూరంలోని స్థావరాలపై దాడులుచేసి మనవాళ్లు సూర్యోదయానికల్లా తిరిగి వచ్చేశారు. ఆపరేషన్‌ మొత్తాన్ని డ్రోన్‌ కెమెరాలతో రికార్డుచేశాం’ అని ఆర్మీ చీఫ్‌ వివరించారు.
    
కాగా భారత సైన్యానికి 29వ చీఫ్‌గా జనరల్‌ బిపిన్‌ రావత్‌ గత వారమే బాధ్యతలు చేపట్టడం - సీనియర్లను పక్కనపెట్టి పెద్ద పోస్టుకు రావత్‌ ను ఎంపిక చేయడంపై వివాదం చెలరేగడం తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News