దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 48539 కేసులు నమోదయ్యాయి. మరో 695మంది చనిపోయారు.
దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 13.85 లక్షలకు చేరింది. ఇప్పటివరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 32063కి చేరింది.
*మహారాష్ట్రలో అత్యధికంగా 9251 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 257 మరణాలు చోటుచేసుకున్నాయి.
*ఇక మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా 7888 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది.
* తెలంగాణలో కొత్తగా 1593 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54059కు చేరుకుంది.
*ఇక మూడో స్థానంలో తమిళనాడులో 6988 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత కర్ణాటకలో 5072, ఉత్తరప్రదేశ్ లో 2894 - బీహార్ లో 2803 - రాజస్థాన్ లో 1120 - గుజరాత్ లో 1081 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది.
ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు దాదాపు 63శాతం ఉండగా.. మరణాల రేటు 2.35శాతంగా ఉంది.