తెలంగాణ రాజకీయాలు.. దండుపాళ్యం బ్యాచ్

Update: 2018-10-26 07:15 GMT
ట్రెండ్ మారింది.. తెలంగాణ రాష్ట్ర సమితి - కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు నయా వార్ కు సిద్ధమయ్యారు. సోషల్ మీడియా వేదికగా ‘సోషల్’ వార్ మహా రంజుగా సాగుతోంది. అలా ఇలా కాదు.. అందరికీ గిలిగింతలు పెట్టేలా.. ఆసక్తి పుట్టేలా.. ప్రఖ్యాత సినిమాలు, సన్నివేశాలను కాపీ కొట్టి వాటికి టీఆర్ ఎస్ - కాంగ్రెస్ ముఖ్యుల ముఖాలు తగిలించి సోషల్ మీడియాలో వదలుతున్న వీడియోలు ఇప్పుడు మస్త మజానిస్తున్నాయి..

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఇప్పుడు సోషల్ వార్ పొలిటికల్ వార్ ను మించి నడుస్తోంది. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తన కూతురు కవితకు గులాబీ పార్టీ సోషల్ మీడియా క్యాంపెయిన్ బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆమె ట్విట్టర్ - ఫేస్ బుక్ - వాట్సాప్ మాధ్యమాల్లో కేసీఆర్ ను బాహుబలిలా - సింగమ్ లో అజయ్ దేవగణ్ లా చూపిస్తూ మార్ఫింగ్ వీడియోలు - ఫొటోలు విడుదల చేయిస్తూ మహా రంజుగా ఓటర్లను ఆకట్టుకుంటోంది.

అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలను దండుపాళ్యం బ్యాచ్ గా కూడా క్రియేట్ చేసి వదులుతూ అభాసుపాలు చేస్తోంది. కాంగ్రెసోళ్లు తక్కువ తిన్నారా అంతకుముందే ఈ దండుపాళ్యం గెటపుల్లో కేసీఆర్ - కేటీఆర్ - హరీష్ - కవిత ముఖాలను అంటించేసి వారిని దండుపాళ్యం బ్యాచ్ గా మార్చేసి పగ తీర్చుకుంటున్నారు..

ఇలా ప్రఖ్యాత సినిమాలు - ప్రముఖులను తమకు అనుకూలంగా మార్చేస్తూ మార్ఫింగ్ వీడియోలతో ఇప్పుడు సరికొత్త సోషల్ ఫైట్  తెలంగాణ ఎన్నికల్లో చోటుచేసుకుంటోంది. ఆ ప్రచారం ఓటర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

కేసీఆర్ ‘సింగం’లా ప్రతిపక్షాలను చిత్తు చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Similar News