ప్రపంచ వ్యాప్తంగా ఈజిప్ట్ మమ్మీలతో పాటు అనేక రకాల మమ్మీల గురించి మనం వింటూనే ఉంటాం. అయితే ఇంతవరకు చూసిన మమ్మీలన్నీ చాలా వరకు కాస్త డికంపోజ్ అయినట్లుగానే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకొనే మమ్మీ మాత్రం.. ప్రపంచంలోనే అందమైన మమ్మీగానే కాకుండా ఓ మిస్టరీగా మారింది. రెండేళ్ల బాలిక వంద సంవత్సరాల క్రితం చనిపోయింది. అయితే ఆ బాలిక శరీరం శవపేటికలో ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది.
ఇటలీలో రోసాలియా లాంబార్డో అనే రెండేళ్ల చిన్నారి డిసెంబర్ 2, 1920 న స్పానిష్ ఫ్లూతో చనిపోయింది. ఆ మృతదేహాన్ని మమ్మీలా మార్చి నైట్రోజన్తో నిండిన గాజు పేటికలో భద్రపరిచారు. ఇప్పటికీ ఆ మృతదేహం పాడవలేదు. శరీరం, ఎముకలు, అవయవాలు చెక్కుచెదరలేదు, మెదడు పరిమాణం మాత్రం 50 శాతం తగ్గిపోయింది.
శరీరం దెబ్బతినకుండా ఉండటానికి ఏమైనా రసాయనాలు వాడిఉంటారని నిపుణులు భావిస్తున్నారు. అయితే రోసాలియా ఒక మైనపు ముద్ద అని పలువురు వాదిస్తున్నారు. ఏదేమైనా.. ఇది మాత్రం ప్రపంచంలోనే అందమైన మమ్మీగా పేరు గాంచింది.
ప్రస్తుతం ఇది పర్యాటక ఆకర్షణగా మారింది. దీన్ని చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లే కాకుండా విదేశాల నుంచి కూడా టూరిస్టులు వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
చనిపోయిన వారిని కలిసే ప్రదేశంగా పేరుగాంచిన కపుచిన్ కాటాకాంబ్స్‌లో దాదాపు 8,000 శవాలు, దాదాపు 1,284 మమ్మీలు ఉన్నాయంట.
కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం ఈ మమ్మీ శవపేటికలో ఉండటం వల్ల ఇరు పక్కల ఉండే గాజు విండోలు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ కలిగించి ఆ మమ్మీ చెక్కుచెదరకుండా ఉన్నట్లు కనిపించేలా చేస్తున్నాయని, పగటి పూట వేరేలా ఉంటుందని చెబుతున్నారు.