అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ ఎదురైంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడి హోదాలో బ్రిటన్ లో పర్యటించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఆయన పర్యటనను బ్రిటన్ రాణి వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏడు ముస్లిం దేశాలకు చెందిన పౌరులకు అమెరికా ప్రవేశం నిషేధం అంటూ కఠిన ఆంక్షలు పెడుతున్న ట్రంప్‌ను బ్రిటీష్ దేశ ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆ దేశ మహారాణి ఎలిజబెత్ సైతం ట్రంప్ కి మహిళపై చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలు - స్త్రీలపట్ల ఆయనకున్న ద్వేషాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడికి బ్రిటన్ ఆహ్వానం అందే పరిస్థితి కనిపించడం లేదు.
గత కొన్ని రోజులుగా ట్రంప్ బ్రిటన్ పర్యటనకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ మొదలు పెడితే అనూహ్య స్పందన లభించింది. ‘డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ కింగ్ డమ్’ పర్యటనను అడ్డుకోండి అనే బ్రిటన్ పార్లమెంట్ లో పెట్టిన పిటిషన్ పై పది లక్షల మంది సంతకాలు చేశారు. హౌస్ ఆఫ్ కామన్స్’లో చర్చించాలంటే కనీసం లక్ష సంతకాలు అవసరం. అయితే ఏకంగా పది లక్షల సంతకాలు వచ్చేసరికి బ్రిటన్ ప్రజలు ట్రంప్ ను ఎంతగా వ్యతిరేకిస్తున్నారో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ బ్రిటన్ అధికారిక పర్యటనకు ఆహ్వానం అందే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. మరోవైపు ట్రంప్ రాజేసిన మంటలు ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. ట్రంప్ దెబ్బకు కొన్ని సంస్థలు తమ సిబ్బందికే చెక్ పెడుతుండగా.. మరికొన్ని సంస్థలు మాత్రం అతడి ఆదేశాలను ధిక్కరిస్తున్నాయి. వరల్డ్ ఫేమస్ కాఫీ చెయిన్ స్టార్ బక్స్ కూడా ట్రంప్ ఆదేశాలను ధిక్కరించింది. వచ్చే ఐదేళ్లలో 10 వేల మంది శరణార్థులకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ సంస్థ చైర్మన్ - సీఈఓ ప్రకటించి కలకలం సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలిస్తామని.. ఈ చర్యలను అమెరికా నుంచే ప్రారంభిస్తామని ఈ సంస్థ తెలిపింది. ఇటు ట్రంప్ నిర్ణయం కొన్ని విమానయాన సంస్థలపై ప్రభావం చూపుతోంది. ఎమిరేట్స్ సిబ్బందికి అమెరికాలో ప్రవేశం లేకపోవడంతో ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్.. అమెరికా వెళ్లే విమానాల్లో సిబ్బందిని, పైలెట్లను మార్చేసింది.
కాగా..ఉగ్రవాదాన్ని అణిచివేస్తామన్న ట్రంప్ ప్రకటన పాక్ పై మాత్రం గట్టి ప్రభావం చూపించింది. ట్రంప్ వార్నింగ్ తో లష్కర్ ఎ తొయిబా చీఫ్ హఫిజ్ సయీద్ ను పాక్ హౌస్ అరెస్ట్ చేసింది. అతడి సంస్థ జమాత్ ఉద్ దవాను నిషేధిత సంస్థగా ప్రకటించేందుకు సిద్ధమైంది. 2008లో జరిగిన ముంబై దాడుల్లో 164 మంది చనిపోవడానికి సయీదే కారణం. మరోవైపు త్వరలో పాకిస్థాన్ పైనా ఆంక్షలు విధిస్తారనుకుంటున్న సమయంలో.. ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కామెంట్ కలకలం సృష్టించింది. వీసా ఆంక్షలు పాక్‌పైనా విధించాలని ఇమ్రాన్ ఖాన్ ట్రంప్‌ను కోరాడు. కనీసం అప్పుడైనా పాకిస్థానీలు తమ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెడతారని ఆశించాడు. తర్వాత తాము కూడా ఇరాన్‌లా అమెరికన్లను పాక్‌లో అడుగుపెట్టనివ్వమన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/