దేశంలో కరోనా మరోసారి కోరలు చాస్తున్నది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతున్నది. మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు ఉన్నప్పటికీ మిగతా రాష్ట్రాల్లోనూ దాని ప్రభావం ఉంటోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో స్కూళ్లు బంద్ చేశారు. విద్యార్థులను ప్రమోట్ చేశారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కేసులు, మరణాలు అస్సలు తగ్గడం లేదు. అయితే శాస్త్రవేత్తలు ఓ షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తేచ్చారు.
కేవలం 45 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచిస్తున్నది. కరోనాతో మరణించిన వారు ఎక్కువగా.. ఈ వయసు వారే ఉన్నారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
దేశంలో కరోనా పరిస్థితిని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. భారత్‌లో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వాళ్లలో 88% 45 ఏళ్లు నిండినవారేనని కేంద్రం అంటున్నది.
అందుకే ఏప్రిల్ 1 నుంచి కరోనా వ్యాక్సిన్ తీసుకొనేందుకు అనుమతి ఇస్తున్నామని కేంద్రం చెప్పింది. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవువుతుందని స్పష్టంచేశారు.
దేశ వ్యాప్తంగా బుధవారం 5,08,41,286 మందికి వ్యాక్సినేషన్ చేశారు.ఇప్పటిదాకా 20 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 92శాతం మేర టీకా తొలి డోస్ పంపిణీ జరిగిందన్నారు.కోవిడ్ మృతుల్లో 88%మంది ఈ వయసు వారే.దేశంలో యాక్టివ్ కేసులు మరోసారి 3లక్షలు దాటాయి. మహారాష్ట్ర, పంజాబ్‌లలో అధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, పుణె, నాగ్‌పూర్, ముంబయి, ఠానే, నాసిక్, ఔరంగాబాద్, బెంగళూరు అర్బన్ (కర్ణాటక), నాందేడ్, జల్‌గావ్, అకోలా ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
మరోవైపు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోనూ కొత్త కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో, అహ్మదాబాద్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్‌లలో కొత్త కేసులు వస్తుండగా.. మధ్యప్రదేశ్‌లో భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, ఉజ్జయిని, బేతుల్‌లో వస్తున్నట్టు గుర్తించామన్న్నారు. ఒక్కరోజే 47,262 కొత్త కేసులు రాగా.. 275 మంది మృతిచెందారు. 23,907మంది కోలుకున్నారు. ఇది కొత్త స్ట్రెయిన్ పాత కరోనా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.