ఇటీవల కాలంలో భారత దేశ పౌరసత్వానికి భారీ డిమాండ్ ఏర్పడింది. విదేశాల నుంచి మన దేశానికి వచ్చి సెటిల్ అవ్వాలి అనుకునే వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. భారత్ కు వచ్చి ఇక్కడే జీవితం కొనసాగించాలి అనుకునే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను కూడా ఇటీవల పార్లమెంటులో విడుదల చేశారు. అయితే భారత్ కు చిరకాల ప్రత్యర్థి, దాయాది దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి ఎక్కువ మంది భారత్ కి వచ్చి నివసించాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది.
భారత్ లో పౌరసత్వం పొందడానికి మొగ్గుచూపే ఇతర దేశాల వారిలో పాకిస్తాన్ కు చెందిన వారు ఎక్కువగా ఉన్నారని అధికారులు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా ఈ దేశాల మధ్య సఖ్యత అనేది చాలా ఏళ్లుగా కొరవడింది. భౌతికంగా గానే గాక, సామాజిక పరిస్థితులు దృష్టా చాలా అధ్వానంగా ఉంది. అయితే భారత్ లో సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది పాకిస్తాన్ కు చెందిన వారు ఉండడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
భారత రాజ్యాంగంలోని పౌరసత్వ చట్టం 1955 ప్రకారం ఇతర దేశాల ప్రజలు మనదేశంలో ఉండేందుకు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇలా 2016 నుంచి 2021 వరకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయి పార్లమెంట్ లో తెలిపారు. ఈ మధ్య కాలంలో భారత్ సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య సుమారు 15 వేలు ఉన్నదని చెప్పారు. ఈ క్రమంలోనే 2016 నుంచి గతేడాది వరకు సుమారు 4,800 మందికి పౌరసత్వం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇంకా 10 వేలకు పైగా దరఖాస్తులు పెండిగ్ లో ఉన్నట్లు తెలిపారు.
అయితే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది దాయాది దేశం వారే ఉన్నారని మంత్రి పార్లమెంట్లో వెల్లిండిచారు. అంతేగాకుండా మన దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని ఆమోదం లభించిన వారిలో పాక్ తరువాత ఆఫ్గాన్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. సుమారు 431 మంది అఫ్గనిస్తాన్ కు చెందిన వారికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఇంక మూడు, నాలుగు స్థానాల్లో బంగ్లాదేశ్ కు చెందిన వారు 132 మంది ఉండగా.. పక్కన ఉన్న దేశమైన శ్రీలంకకు చెందిన 92 మందికి కేంద్రం భారత్ లో నివసించేందుకు అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేశారు. మరో వైపు అగ్రరాజ్యం అమెరికా నుంచి కూడా భారత్ లో నివాసం ఉండేందుకు వస్తున్నారు. సుమారు 80 మందికి 2016 నుంచి 2021 వరకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి వివరించారు.
ప్రస్తుతం కేంద్రం దగ్గర సుమారు 10,635 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో కూడా పాక్ నుంచి దరఖాస్తు చేసుకున్న వారే ఎక్కువ ఉన్నారు. ఆ తరువాత ఆప్గాన్ కు చెందిన వారు 1,152 మంది సిటిజన్షిప్ కోసం వేచి చూస్తున్నారు. ఈ దేశం రెండో స్థానంలో ఉంది. కొంతమంది అయితే ఏ దేశం పేరు చెప్పకుండా మన దేశంలోకి రావాలనుకునే వారి సంఖ్య నాలుగు వందలకు పైనే ఉందని కేంద్రం తెలిపింది.
భారత పౌరసత్వం ఇవ్వడంలో కూడా కేంద్రం కఠినంగా వ్యవహరించడం లేదు. దీంతో పెద్ద సంఖ్యలో బయట దేశస్తులకు పౌరసత్వం లభిస్తుంది. ఏడాదికి ఏడాదికి భారత్ పౌరసత్వం ఆశించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గతేడాది 1,773 మందికి మన దేశ పౌరసత్వం ఇచ్చింది కేంద్రం. ఇదిలా ఉంటే మన దేశాన్ని విడిచి పక్క దేశాల కోసం ఎగచూసే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. సుమారు 8 లక్షల మంది భారత్ నుంచి వెళ్లిపోయేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఎక్కువ మంది అమెరికా లో సెటిల్ అవ్వడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఆ తరువాత కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో సెటిల్ అవుతున్నారని కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి.