ప్ర‌తీదానికీ బీమా ధీమా ఉంటుంది..!

Update: 2016-12-29 21:30 GMT
ఇన్సూరెన్స్ అన‌గానే మ‌న‌లో చాలామందికి గుర్తొచ్చేవి... ఆరోగ్య బీమా - వాహ‌న బీమా - గృహ బీమా లాంటివి! వీటితోపాటు ఈ మ‌ధ్య ట్రావెల్ ఇన్సూరెన్స్ లు కూడా తీసుకుంటున్నారు. పెదాల‌కు బీమా ఉంటుంద‌ని మీకు తెలుసా..?  కేవ‌లం కాళ్ల‌కు మాత్ర‌మే పాల‌సీ తీసుకున్న‌వారున్నార‌ని విన్నారా..?  అంద‌మైన పాదాల‌కు పాల‌సీలు ఇచ్చే కంపెనీలు చూశారా..? అంతేకాదు, కుక్క‌ల‌నీ పెళ్లిళ్ల‌కీ చివ‌రికి టీవీ కార్య‌క్ర‌మాల‌కు కూడా ప్ర‌త్యేకంగా బీమాలు ఉన్నాయి. అవునండీ... బీమాల‌న్నీ ఒకేలా ఉండ‌వు!

చాలామంది సెలెబ్రిటీలు త‌మ శ‌రీర భాగాల‌కి భారీ ఎత్తున ఇన్సూరెన్స్ తీసుకున్నారు. త‌న అంద‌మైన చిరున‌వ్వుని బీమా చేయించుకుంది జూలియా రాబ‌ర్ట్స్‌. బెట్టె డేవిడ్ అయితే న‌డుముకి పాల‌సీ తీసుకున్నారు. బాలీవుడ్ తారలు చాలామందే ఇలాంటి ఇన్సూరెన్స్ లు తీసుకున్నారు. సెక్సీ స్టార్ మ‌ల్లికా శెరావ‌త్ త‌న అందాల‌పై గ‌తంలో పాల‌సీలు తీసుకుంది. మినీషా లాంబా కూడా అందాల‌కు ప్రీమియం క‌ట్టింది. అప్ప‌ట్లో ఎప్పుడూ వివాదాల్లో ఉండే రాఖీ సావంత్ కూడా త‌న సౌంద‌ర్యాల‌కు బీమా ర‌క్ష‌ణ క‌ల్పించుకుంది. ల‌తా మంగేష్క‌ర్ గురించి మాట్లాడుకోగానే మ‌ధుర‌మైన గొంతు మ‌న‌కు గుర్తొస్తుంది. అందుకే, ఆమె కూడా త‌న స్వ‌రానికి బీమా ర‌క్ష‌ణ క‌ల్పించుకున్నారు. ఇక‌, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పేరు విన‌గానే స్టైల్ తోపాటు పంచ్ డైలాగులు గుర్తొస్తాయి. ర‌జినీ మార్కు నవ్వు అంద‌రికీ తెలిసిందే. ర‌జ‌నీ కూడా త‌న గొంతుకు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. టెన్సిస్ స్టార్ సానియా మీర్జా కూడా త‌న చేతులకు బీమా పాల‌సీ క‌ట్టింది.  

చాలామంది ఇళ్ల‌ల్లో కుక్క‌ల్ని ఎంతో ముద్దుగా పెంచుకుంటారు. కుటుంబ స‌భ్యుల‌తో స‌మానంగా ప్రేమానురాగాలు పంచుతారు. అందుకే, వాటి ర‌క్ష‌ణ కోసం బీమా పాల‌సీలు తీసుకునేవారు కూడా ఉన్నారు. పెట్ ఇన్సూరెన్సులు ఇచ్చే కంపెనీలు చాలానే ఉన్నాయి. బీమా ర‌క్ష‌ణ పొందిన కుక్క చ‌నిపోతే... ఇన్సూరెన్స్ సొమ్మును ఆ య‌జ‌మానికి ఇస్తారు. ఆ సొమ్ముతో కొత్త కుక్క‌ను కొనుక్కోవ‌చ్చ‌న్న‌మాట‌!

పెళ్లిళ్ల‌కు ఇన్సూరెన్సులు కూడా ఈ మ‌ధ్య పెరుగుతున్నాయి. వివాహాన్ని భారీ వ్య‌యంతో నిర్వ‌హించేవారు ప్ర‌మాద బీమాను తీసుకుంటున్నారు. పెళ్లిళ్ల‌లో ప్ర‌మాదవ‌శాత్తూ ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగితే బీమా భ‌ద్ర‌త ఉంటుంది. కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి కార్య‌క్ర‌మంలో ఇచ్చే ప్రైజ్ మ‌నీకి కూడా బీమా చేయించార‌ట‌! సో... ఇన్ని ర‌కాల బీమా ప‌థ‌కాలు ఉన్నాయ‌న్న‌మాట‌!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News