కన్నప్రేమను వదిలేసి ఓ మహిళ క్రూరంగా మారింది. తన చేతులతోనే పిల్లలను చంపేసింది. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఆమె తన ఐదుగురి పిల్లలను గంగానదిలోకి తోసేసిన ఘోర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అయితే కుటుంబ సమస్యలతో పాటు ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తన పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితిలో ఈ ఘోరానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ వార్త దేశంలో సంచలనం రేపుతోంది.
ఉత్తరప్రదేశ్ లోని బదౌహీలో మంజుయాదవ్ - మృదుల్ యాదవ్ భార్యాభర్తలు. వారికి ఆర్తి - సరస్వతి - మాతేశ్వరి - శివశంకర్ - కేశవ్ ప్రసాద్. అయితే ఏడాది కాలంలో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా గొడవపడ్డారు. అదే రాత్రి క్షణికావేశంలో తన పిల్లలను తీసుకుని జహంగీరాబాద్ ఘాట్ వద్దకు చేరుకుని తన పిల్లలను నదిలోకి తోసేసింది. తోసేసి అక్కడే చాలాసేపు ఉంది. అయితే అక్కడే ఉన్న మత్య్సకారులు ఆమెను గమనించి ప్రశ్నించగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. అతడు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ ఘటనలో మరో కోణం కూడా ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ విధించడంతో ఆమె ఉపాధి కోల్పోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకు. ఆమె రోజువారీ కూలీగా పని చేసేది. ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్ తో ఆమెకు ఎక్కడా పని దొరకడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పిల్లలకు భోజనం పెట్టలేని దుస్థితికి చేరడంతో ఈ ఘోరమైన నిర్ణయం తీసుకుందని సమాచారం. వాస్తవంగా ఇదే కారణమని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో పైవిధంగా కథ అల్లినట్లు తెలుస్తోంది. ఎందుకంటే వారిది పేద కుటుంబం. పనికి పోతే కానీ కడుపు నిండని పరిస్థితి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయని.. ఆ క్రమంలోనే ఆమె ఉపాధి కోల్పోయి పిల్లలకు భోజనం అందించలేక చంపేసుకున్నదని అక్కడి ప్రజలు కూడా చెబుతున్నారు. అయితే ఏది వాస్తవమో.. అవాస్తవమో కానీ ముక్కుపచ్చలారని చిన్నారులు బలయైపోయారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.