మోత్కుపల్లి నర్సింహులు...తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కాబోయే గవర్నర్ కూడా. అయితే ఎప్పుడు గవర్నర్ అవుతారో తెలియని అస్పష్టత ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ క్లారిటీ మోత్కుపల్లికి కూడా లేకపోవడంతోనే ఆయన పక్క చూపులు చూస్తున్నారని గతంలోనే వార్తలు వెలువడ్డాయి. దీన్ని నిజం చేస్తున్నట్లుగా తాజాగా సీఎం కేసీఆర్ తో మోత్కుపల్లి నర్సింహులు భేటీ అయినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.
పలు టీవీ ఛానల్లలో వస్తున్న వార్తల ప్రకారం సీఎం కేసీఆర్‌ను తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్‌కు వెళ్లారు. సుమారు 15 నిమిషాల పాటు వారి భేటీ జరిగిందని తెలుస్తోంది. అయితే పేరుకు పెళ్లికి ఆహ్వానం అయినప్పటికీ...టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకే కేసీఆర్‌తో మోత్కుపల్లి సమావేశమయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదనే అసంతృప్తి సుదీర్ఘకాలంగా మోత్కుపల్లిని వెంటాడుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అదే సమయంలో ఆయన్ను గవర్నర్ చేయడం అనే వార్తలు కూడా నిజం కాలేదు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం తెలంగాణ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోత్కుపల్లి తన దారి తాను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/