‘15 ఏళ్లు చంద్రబాబు కోసం.. పార్టీ కోసం పనిచేశా.. నన్నింత చిన్న చూపు చూస్తారా.. ఒక దళిత నేతకు ఇచ్చే గౌరవమిదేనా’ అని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు.. తెలంగాణలోని హైదరాబాద్ నిర్వహిస్తున్న టీడీపీ మహానాడుకు తనను అహ్వానించకపోవడంపై మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు..ఇలా అవమానపరచడం బాధగా ఉందన్నారు.
‘‘మహానాడుకు వెళ్లే అదృష్టం నాకు లేదు.. అధికారం లేకపోయినా .. బాబు దగ్గర పనిచేసిన మంత్రులంతా పరారైనా.. బాబు కోసమే పనిచేశాను.. నేను ఏ బ్యాక్ గ్రౌండ్ లేనివాడిని.. ‘నర్సింహులు.. నువ్వు నాకు తోడుగా ఉండు’ అన్నందుకు బాబుకు అండగా ఉన్నా.. సిద్ధాంతపరంగా కాంగ్రెస్ తో పొత్తు అసాధ్యమని.. టీఆర్ ఎస్ తో అయితదని చెప్పిన.. ఇప్పుడూ చెబుతున్నా.. తప్పా.? మా నాయకుడు కూడా నన్ను అవమాన పరిస్తే దిక్కెవరు?’’ అంటూ మోత్కుపల్లి చంద్రబాబు తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.