మూడు రాజధానుల అంశంలో కదలిక

Update: 2021-03-21 05:04 GMT
ఏపీ రాజధాని అంశం విచారణకు వేళైంది. రాజధానిని విశాఖకు మార్చేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతున్న వేళ ఈ పిటీషన్లపై మార్చి 26 నుంచి హైకోర్టు విచారణ జరుపనుంది. రాజధాని వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనాన్ని తాజాగా హైకోర్టు ఏర్పాటు చేసింది. ఇందులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏక గోస్వామి, జస్టిస్ జోయ్ మల్య బాగ్బీ , జస్టిస్ జయసూర్యలు సభ్యులుగా ఉన్నారు.

గతంలో అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపింది.

గతంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి బదిలీతో ఈ వ్యాజ్యాలపై విచారణ నిలిచిపోయింది. రాజధాని వ్యాజ్యాలపై విచారణ త్వరగా చేపట్టాలని ఇటీవల అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం హైకోర్టును కోరడంతో విచారణను వేగవంతం చేయనుంది.

ఇక హైకోర్టు సీజే తాజాగా రోస్టర్ లో మార్పులు చేసి న్యాయమూర్తులు విచారించే వ్యాజ్యాలపై సబ్జెక్టుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఏపీ మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుపై గవర్నర్ వేసిన గెజిట్ పై ఏపీ హైకోర్టు స్టే విధించింది. దీనిపై సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటీషన్ దాఖలు చేసింది.  మొత్తం హైకోర్టులో 101 పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇక విచారణను వేగవంతం చేయనున్నారు.
Tags:    

Similar News