యువ‌హీరో అనుమానాస్ప‌ద మృతిపై మూవీ.. కోర్టు తీర్పు ఇదీ!

Update: 2022-06-11 02:52 GMT
గత ఏడాది జూన్ లో బాలీవుడ్ యువ‌హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానా స్ప‌ద స్థితిలో మృతి చెంద‌డం సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. అత‌డి మ‌ర‌ణానంత‌రం ప‌లువురు సినిమాల్ని ప్ర‌క‌టించారు.  ఇప్పుడు అత‌డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఓ సినిమా విడుదలపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. 'న్యాయ్: ది జస్టిస్' అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం నేడు (11 జూలై) విడుదలైంది.

దీనిని సుశాంత్ కుటుంబం అంగీక‌రించ‌డం లేదు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ దివంగత నటుడు సుశాంత్ తండ్రి కృష్ణ కిషోర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఈ సినిమాని చిత్రీకరించారని ..సుశాంత్ మరణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ వ్యక్తులచే ఆర్కెస్ట్రేట్ పద్ధతిలో ఈ మూవీని ప్రారంభించార‌ని ఆయన పిటిష‌న్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సంజీవ్ నరులా నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. అలాగే సినీ నిర్మాతలు ఖాతాలను మ్య‌నేజ్ చేయాల‌ని కూడా కోర్టు తీర్పునిచ్చింది.

ఏప్రిల్ లో తన కొడుకు పేరు లేదా పోలికలను వెండితెరపై ఎవరూ ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ కృష్ణ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో సింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై ప్రతిస్పందించాల్సిందిగా అప్ప‌టికే చిత్రీకరణలో ఉన్న ప‌లువురు చిత్ర‌ నిర్మాతలను హైకోర్ట్ కోరింది. సుశాంత్ మరణం యావత్ చిత్ర పరిశ్రమను అతని అభిమానులను అతని కుటుంబాన్ని తీవ్ర‌ దిగ్భ్రాంతికి గురి చేసింది.

ప్రస్తుతం ఈ కేసును సీబీఐ- ఈడీ- ఎన్ సీబీ సహా మూడు జాతీయ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. ఆయన మరణానంతరం పలువురు దర్శకనిర్మాతలు ఆయన జీవితంపై సినిమాలను ప్రకటించారు. కొన్ని చిత్రీక‌ర‌ణ‌ల ద‌శ‌లో ఉండ‌గా న్యాయ్ చిత్రం నేడు విడుద‌లైంది.

పిటిషన్ లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కొన్ని చిత్రాల పేర్లను పేర్కొన్నాడు- న్యాయ్‌: ది జస్టిస్- సూసైడ్ ఆర్ మర్డర్: ఎ స్టార్ ఈజ్ లాస్ట్- శశాంక్ ... అలాగే పేరులేని క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ ల గురించి అత‌డు ప్రస్థావించారు. దావా ప్రకారం. సూసైడ ఆర్ మ‌ర్డ‌ర్.. శశాంక్ సినిమాల‌ షూటింగ్ ప్రారంభించారు. 'న్యాయ్' జూన్ లో విడుదల కానుందని వెల్లడైంది. ప్రతివాదులు (చిత్రనిర్మాతలు) సుశాంత్ మ‌ర‌ణాన్ని .. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునే దుర్మార్గపు ఉద్దేశ్యాలతో ఉన్నారు'' అని పిటిషన్ లో పేర్కొన్నారు. రాజ్‌పుత్ కుటుంబానికి ''పరువు నష్టం.. మానసిక గాయం.. వేధింపుల'' కారణంగా చిత్రనిర్మాతల నుండి రూ. 2 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించాలని సింగ్ కోరారు.

''సినిమా.. వెబ్ సిరీస్.. పుస్తకం లేదా సారూప్య స్వభావం గల ఏదైనా ఇతర కంటెంట్ ను ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి అనుమతించినట్లయితే అది బాధితుడు లేదా మరణించిన వ్యక్తి కేసును ప్ర‌భావితం చేస్తుంది.. న్యాయ‌విచార‌ణ‌లో ఇది విరుద్ధం అంటూ పిటిష‌న్ లో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ ని ఆపేందుకు హైకోర్టు నిరాక‌రించింది. 'న్యాయ్: ది జస్టిస్' అనే టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం (11 జూలై) విడుదలైంది.
Tags:    

Similar News