భైంసాలో చోటుచేసుకున్న అల్లర్లపై బీజేపీ ఎంపీ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భైంసాలో పక్కా ప్రణాళికతో అల్లర్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇది బంగారు తెలంగాణనా? లేక మజ్లిస్ రాజ్యమా? అని ప్రశ్నించారు.
పరమత సహనం కేవలం హిందూ ధర్మంలోనే ఉంటుందన్న విషయాన్ని సీెం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గుర్తు పెట్టుకోవాలని అరవింద్ సూచించారు. భైంసాలో అసలేం జరుగుతుందో నిఘా పెట్టాలని త్వరలోనే కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు.
గత ఏడాది భైంసాలో అల్లర్లు జరిగినప్పుడు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే మళ్లీ ఈ పరిస్థితి పునరావృతమయ్యేది కాదని అరవింద్ అన్నారు. భైంసాలో అల్లర్లకు ఓ వర్గం వారు నలుగురు కారణం అని ఎంపీ అరవింద్ ఆరోపించారు. వీరికి స్థానిక కలెక్టర్ తోపాటు ఎంఐఎం పార్టీ మద్దతు ఉందని ఆరోపించారు. కాశింబేగ్ ను అక్కడి నుంచి 15 ఏళ్లపాటు అక్కడి నుంచి బహిష్కరించినా స్వేచ్ఛగా తిరుగుతున్నాడని అన్నారు.మజీద్ అనే వ్యక్తి మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ రాజ్యమేలుతున్నాడని అరవింద్ ఆరోపించారు. హిందువుల స్థలాల కబ్జా చేశారని మండిపడ్డారు.
భైంసాలో అల్లర్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్.. తాజాగా హోంమంత్రి మహమూద్ అలీకి ట్వీట్ చేయడంపై అరవింద్ విమర్శించారు. కేటీఆర్ బాలీవుడ్ మత్తులో నుంచి బయటకు రావాలని విమర్శించారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువుల ప్రాణాలను టీఆర్ఎస్ ఫణంగా పెడుతోందన్నారు. సిట్టింగ్ జడ్జీతో అల్లర్లపై విచారణ జరిపించాలని.. దోషులను ఉరికంభం ఎక్కించాలని డిమాండ్ చేశారు.