మునుగోడులో బీజేపీ జెండా ఎగురవేయాలని కమలనాథులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. ఆ మేరకు కార్యాచరణ రూపొందించుకుంది. అగ్రనేతలను రంగంలోకి దింపింది. అమిత్ షా, జేపీ నడ్డా బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నారు. మునుగోడు బైపోల్ లో విజయం.. రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తుకు అత్యవసరం. అది గెలవకుండా ఆయన రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది. ఓడిపోతే క్లోజ్ అవుతారు. అందుకోసమే ఆయన ప్రచారం కోసం అగ్రనేతలను దింపుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అతడి అనుయాయులు బిజీగా ఉన్నారు.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా బీజేపీ ఎంపీలు, అగ్రనేతలంతా మునుగోడులో దిగిపోయారు.టీఆర్ఎస్ పై ఎదురుదాడికి దిగారు. ఉప ఎన్నికల్లో డబ్బుల ప్రవాహం నడుస్తోంది. నేతలకు ప్యాకేజీలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో చోటా మోటా నేతకు రూ.10లక్షలు ఇచ్చి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట..
మునుగోడు ఉప ఎన్నికల వేళ బీజేపీలోని యాక్టివిస్టులు అందరూ వాలిపోయారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆ ముగ్గురు ఐరన్ లెగ్ లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం దత్తత తీసుకున్న గ్రామాలు ఏడుస్తున్నాయని గుర్తు చేశారు. కేటీఆర్ మంత్రిగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. కొత్తగా దత్తత తీసుకొని ఏం చేస్తారని నిలదీశారు. దత్తత పేరుతో ఎవరి చెవిలో పువ్వులు పెడుతారని మండిపడ్డారు. ఆయన ఎలాంటి కామెంట్స్ చేసినా జనం నమ్మే పరిస్తితిలో లేరని చెప్పారు.
ఇక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక్కో ఓటుకు రూ.40వేలు ఇచ్చేందుకు సిద్ధమైందని బీజేపీ ఆరోపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.10వేలు ఇచ్చిన టీఆర్ఎస్.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రూ.20వేలు ఇచ్చిందని.. ఇప్పుడు దాన్ని 40వేలు చేసిందని ఆరోపిస్తోంది.
ఈ లెక్కన ఓటుకు రూ.40వేలు మునుగోడు ఓటర్ల అప్పులన్నీ తీరిపోయినట్టే. కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉంటే వారు లక్షాధికారి అయినట్టే.. అప్పులు తీర్చి అవసరాలు తీర్చుకోవచ్చు. మునుగోడు ఉప ఎన్నిక ఖచ్చితంగా మునుగోడు ప్రజల ఆర్థిక అవసరాలు అయితే తీరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.