మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ.. సీబీఐ విచారణకు హాజరు కాకుండా ఎప్పటికప్పుడు ఏదో కారణాలు చెబుతున్న వైసీపీ ఎంపీ అవినాశ్ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే టార్గెట్ చేస్తున్నట్లుగా కొందరు వాదనలు వినిపిస్తుంటే.. సీబీఐ విచారణ పేరుతో వేధింపులకు గురి చేయాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న మాట మరికొందరి నోట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. సీబీఐ విచారణకు హాజరు కావటానికి హైదరాబాద్ వచ్చిన అవినాశ్.. అంతలోనే తన తల్లి శ్రీలక్ష్మి (లక్ష్మమ్మ) తీవ్ర అనారోగ్యానికి గురైనందన్న కారణాన్ని చూపి పులివెందులకు బయలుదేరటం తెలిసిందే.
ఆయన వెళుతున్న వేళలో.. ఆయనకు ఎదురుగా తల్లిని అంబులెన్సులో తీసుకొస్తున్న వేళ.. ఆమె వాహనంతో కలిసి హైదరాబాద్ కు బయలుదేరటం తెలిసిందే. అనూహ్యంగా ఆమెను కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్చించారు. సాధారణంగా సీమ పరిధిలోని ఉమ్మడి నాలుగు జిల్లాలకు చెందిన సామాన్యులు మొదలుకొని ప్రముఖుల వరకు.. ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైతే అయితే బెంగళూరు లేదంటే హైదరాబాద్ కు రావటం కనిపిస్తుంది.
అందుకు భిన్నంగా అవినాశ్ తల్లిని మాత్రం కర్నూలులో ఎందుకు చేర్పించారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి వేళ.. వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. విశ్వభారతి ఆసుపత్రి అధినేత డాక్టర్ కాంతారెడ్డి అల్లుడు డాక్టర్ హితేష్ రెడ్డి సొంతూరు పులివెందుల సమీపంలోని సింహాద్రిపురం. దీనికి తోడు.. డాక్టర్ హితేష్ రెడ్డికి అవినాశ్ రెడ్డితో స్నేహం ఉంది. దూరపు బంధురికం కూడా ఉందని చెబుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. విశ్వభారతి ఆసుపత్రిలో జనరల్ ఫిజిషిన్ కు ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిచయాలు ఉన్నాయని.. వారి సూచన మేరకు కర్నూలు ఆసుపత్రిలో చేర్పించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అవినాశ్ తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు మాట్లాడుతూ..ప్రస్తుతం ఐసీయూలో చికిత్స జరుగుతుందని.. మరికొన్ని రోజులు వైద్యం అవసరమని చెబుతున్నారు.
ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షలో ట్రోపోనిన్ పాజిటివ్ గా వచ్చిందని.. గుండెపోటు వచ్చేందుకు అదో సంకేతమని చెబుతున్నారు. యాంజియోగ్రామ్ లోనూ ఆమెకు రెండు నరాల్లో బ్లాక్స్ ఉన్నట్లుగా గుర్తించినట్లు చెబుతున్నారు. రక్తపోటు తక్కువగా ఉండటంతో సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఆమెకు ఎలాంటి వైద్యం అందించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. మొత్తంగా ఆమెకు మరిన్ని రోజులు వైద్యం చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని తేల్చారు తల్లి దగ్గరే ఎంపీ అవినాశ్ ఉండటం గమనార్హం. మరోవైపు.. అవినాశ్ అమ్మ ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో.. ఆయన్ను పరామర్శించేందుకు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు హాస్పిటల్ కు వస్తున్నారు.