తెలంగాణ అధికార.. విపక్ష టీడీపీ మధ్య మాటల దాడి రోజురోజుకీ పెరుగుతోంది. ఓటుకు నోటు కేసుకు సంబందించి జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని.. మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ నేతలు సైతం తీవ్రస్థాయిలో మండిపడటం తెలిసిందే.
తిట్లనే మాటలుగా మార్చేసి.. బండకేసి ఉతికినట్లుగా.. తనలోని అక్కసు మొత్తాన్ని బయట పెట్టిన రేవంత్‌ను ఉద్దేశించి.. టీఆర్‌ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ అధికారపక్షం నేతల మీద విమర్శలు.. ఆరోపణలతో తిట్లు తిట్టేసిన రేవంత్‌పై టీఆర్‌ఎస్ నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఇదే తీరుతో మాట్లాడితే.. భవిష్యత్తులో ఆయన నోరు కుట్టేయటం జరుగుతుందని టీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానించటం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా.. ఆ పార్టీ ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ.. తమ సర్కారు పాలనపై అసత్య ప్రచారం చేస్తే.. రేవంత్‌రెడ్డి నాలుక కోస్తామని హెచ్చరించారు.
కరీంనగర్‌లో మాట్లాడిన బాల్క సుమన్.. బాబు అవినీతిని ఎండగట్టటమే తన పార్టీ లక్ష్యంగా చెప్పారు. తెలంగాణలో టీడీపీకి నూకలు చెల్లాయని చెప్పిన సుమన్.. అలా నూకలు చెల్లిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చినట్లు..? అయినా.. రేవంత్ అడ్డదిడ్డంగా మాట్లాడారని సంస్కారరహితంగా వ్యవహరించారని టీఆర్‌ఎస్ పెద్దల మాట వినకుండా.. నోరు కుట్టేయటం.. నాలుక కోసేయటం లాంటి మాటలు ఎందుకు అంటున్నట్లు..?