కరోనా వైరస్ దేశంలో అలజడి సృష్టిస్తుంది. ఈ కరోనాను అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి కానీ , తగ్గడం మాత్రం లేదు. దీనికి ప్రధాన కారణం ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనే కారణం అని కొందరు అంటున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాతే ..దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీనితో ఢిల్లీ కి వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా బయటకి వచ్చి ..కరోనా టెస్టులు చేపించుకోవాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ , ఇంకా కొంతమంది కరోనా టెస్టులు చేపించుకోవడానికి రావడం లేదు.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బయటకు రాకుండా దాక్కున్న తబ్లీఘీలు 24 గంటల్లో రిపోర్టు చేయకపోతే కఠినమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొవాల్సిన వస్తుందని హెచ్చరించారు.
ఈ సమ్మేళనంలో పాల్గొన్నవారంతా దేశంలోని పలు రాష్ట్రాలకు వెళ్లడంతోపాటు దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి.
మధ్యప్రదేశ్ నుండి నిజాముద్దీన్ మర్కజ్ లో పాల్గొన్నవారిని ప్రభుత్వం క్వారంటైన్ కు తరలించామని - మసీదుల్లో దాక్కున్న కొందరు విదేశీయులను ప్రభుత్వం గుర్తించిందని సీఎం శివరాజ్ తెలిపారు. ఇంకా మరికొంత మంది ఎక్కడో దాక్కుని ఉన్నారు.. వారంతా కూడా 24 గంటల్లో అధికారుల వద్ద సమాచారం ఇవ్వాలని - ఇక అలా చేయకపోతే రాష్ట్ర - దేశ భద్రతకు ముప్పుగా పరిగణించి కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా హెచ్చరించారు. కాగా ,బుదవారం నాటికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 229 కరోనా కేసులు నమోదు కాగా, 13 మంది ప్రాణాలు కోల్పోయారు.