రాజకీయ నాయకులు కొన్ని విషయాలపై స్పందించే తీరు నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అప్పటివరకు స్పందించని వారు..మీడియాలో ఆ విషయం హైలెట్ కాగానే...తమ ఉదారతను చాటుకుంటారు. ఇందులో ఇతరత్రా అంశాలు ఎలా ఉన్నప్పటికీ...వారి సహాయం మాత్రం అభినందనీయం. అలా తమ ఉదారతను చాటుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత.
త్వరలో హైదరాబాద్‌లో జరుగనున్న అంతర్జాతీయ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో నగరాన్ని బెగ్గర్ ఫ్రీసిటీగా మార్చేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని యాచకులను చేరదీసి చర్లపల్లి జైలులోని ఆనందాశ్రమంలో షెల్టర్ కల్పిస్తున్నారు. జీడిమెట్లలో నివాసముంటున్న అంజలి నిత్యం సికింద్రాబాద్‌లో యాచిస్తూ తన ఇద్దరు కుమార్తెలను చదివిస్తున్నది. దీనిపై ఓ పత్రికలో వచ్చిన కథనానికి ఎంపీ కవిత స్పందించారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్‌ను అంజలి యాచిస్తున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు పంపారు. యాచకురాలి దయనీయ పరిస్థితిని తెలుసుకొని ఆమెకు సహాయం చేయాలని సూచించారు.
ఇందులో భాగంగా తక్షణసాయంగా అంజలి ఇద్దరు కుమార్తెలు సిరి, కీర్తి ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున రూ.లక్ష చెక్కును అందించారు. ఎంపిక చేసుకున్న ప్రాంతంలో కిరాణ దుకాణం ఏర్పాటు చేయిస్తానని కవిత హామీ ఇచ్చారు. తద్వారా దయనీయ స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచారు. ఆర్థికసాయంతో అంజలిలో ఆత్మ స్థైర్యం పెరిగిందని రాజీవ్‌సాగర్ తెలిపారు.