తెలంగాణ ఎన్నికల్లో కలుగుచేసుకున్నందుకు చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు కేసీఆర్. ఆ తర్వాత ఆయన వారసుడు కేటీఆర్ కూడా రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా ఉంటుందని..అది చంద్రబాబు నాయుడు ఊహించని రేంజ్‌లో ఉంటుందని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ కుమార్తె నిజామాబాద్ ఎంపీ కవిత కూడా రిటర్న్ గిఫ్ట్ పై స్పందించారు. గిఫ్ట్ కచ్చితంగా ఉంటుందని.. ప్రస్తుతం అది ప్యాకింగ్ దశలో ఉందని చెప్పారు. ఎవరైతే తెలంగాణ ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా పనిచేశారో వారికి తెలంగాణ ప్రజల తరపునుంచి కేసీఆర్ గారి స్టైల్లో రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని కవిత చెప్పారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ బీజేపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు కవిత. అందుకే ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. ఇందులో భాగంగానే అన్ని పార్టీల్ని కలుపుకుని పోతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కోసం ఏపీకి వచ్చి ప్రచారం చేస్తారా, లేదా వెనుక నుంచి మద్దతు ఇస్తారా అనే ప్రశ్నకు ఫెడరల్ ఫ్రంట్‌లో ఉన్న పార్టీలకు ఎలా అయితే మద్దతు ఇస్తామో.. జగన్ పార్టీకి కూడా అలాంటి మద్దతే ఇస్తామని.. వైసీపీకి ప్రత్యేకంగా ఏం చూడడం లేదని చెప్పారు కవిత.
రాబోయే రోజుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయం అని అన్నారు కవిత. చంద్రబాబుకి, కేసీఆర్‌కు అసలు పోలికే లేదని.. కేసీఆర్ వ్యూహాల ముందు చంద్రబాబు తేలిపోతారని అన్నారు. అన్ని అంశాలు కలిసొస్తే కేసీఆర్ జాతీయ స్థాయిలో కీలక నాయకుడు అవుతారని.. అయితే ప్రస్తుతం తమ దృష్టాంతా ఫెడరల్ ఫ్రంట్ గెలుపుపైనే ఉందని చెప్పారు కవిత.