కోలుకున్న కేంద్ర‌మంత్రి...క‌విత రెస్పాన్స్ ఇదే

Update: 2019-02-10 06:31 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత స‌మకాలిన రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆస‌క్తిగా ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో ఎపిసోడ్‌ లో ఆమె చురుకుగా స్పందించారు. మిగ‌తా నేత‌ల కంటే తాను ఎలా భిన్న‌మో చాటిచెప్పారు. కేంద్ర‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత ఆరోగ్యం గురించి అమె ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించారు. స‌ద‌రు కేంద్ర‌మంత్రి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స‌న్నిహితుడు కావ‌డం విశేషం. ఇంతకీ ఆయ‌న ఎవ‌రంటే... కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత అరుణ్ జైట్లీ.

గత జ‌న‌వ‌రి నెల చివర్లో వైద్య చికిత్స నిమిత్తం  అమెరికాకు వెళ్లిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తిరిగి భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంటికి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉన్నదని ట్విట్టర్ ద్వారా జైట్లీ వెల్లడించారు. కాగా, ఆయన మంత్రిత్వ శాఖను తాత్కాలికంగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నెల 1న నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన చివరి, ఆరో మధ్యంతర బడ్జెట్‌ ను గోయల్ పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టారు. మీరు ఇంటికి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉన్నది అరుణ్‌ జైట్లీ జీ. మీ మద్దతు, మార్గదర్శకం, నాయకత్వానికి చాలా కృతజ్ఞతలు అంటు గోయల్ ట్విట్ చేశారు. ఒకవైపు ఆపరేషన్ అయినప్పటికీ మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఆయన పలు స్టోరీలను పోస్ట్‌ చేశారు. ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు గోయల్‌ పై ప్రశంసల జల్లు కురిపించారు కూడా. ప్రస్తుతానికి చికిత్స పూర్తైంది..రివకరీ స్టేజ్‌ లో ఉన్నా ను..డాక్టర్లు తిరిగి వెళ్లిపొమ్మని అనుమతించిన తర్వాతనే భారత్‌ కు వెళ్తున్నాను..బడ్జెట్‌ పై జరిగే చర్చలో గోయల్ సమాధానాలు ఇస్తారు అని న్యూయార్క్ నుంచి బయలుదేరేముందు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైట్లీ చెప్పారు.

ఇదిలాఉండ‌గా, అరుణ్ జైట్లీ రాక‌పై నిజామాబాద్ ఎంపీ కవిత ట్విట్టర్‌ లో స్పందించారు. వెల్‌ కమ్ బ్యాక్ సర్, మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని ఉద్దేశించి ఆకాంక్షించారు. ఇంటికి తిరిగి రావడం సంతోషంగా ఉంది అని జైట్లీ చేసిన ట్వీట్‌ పై కవిత ఈ విధంగా స్పందించారు.
Tags:    

Similar News