సుజనాను నిమ్మగడ్డ కలిస్తే తప్పేంటి: కేశినేని

Update: 2020-06-24 16:30 GMT
బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లను కలిసిన ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శలు చేశారు. బీజేపీ నేతలతో నిమ్మగడ్డ కలవడంలో తప్పేంటి అని సమర్థించారు.

నిమ్మగడ్డ స్థానంలో ఎన్నికల కమిషనర్ గా నియమించిన రిటైర్డ్ జడ్జ్ కనగరాజ్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిస్తే తప్పు లేదు కానీ.. నిమ్మగడ్డ సుజనాను కలిస్తే తప్పా అని కేశినేని నాని ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు ఒక నీతి.. మిగతా వారికి ఇంకొక నీతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రహస్య భేటి ఎలా అవుతుందని విమర్శించారు.

రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న నిమ్మగడ్డ ఇలా చేశాడని విమర్శిస్తున్న వైసీపీ నేతలు.. అసలు నిమ్మగడ్డను వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ గా గుర్తించిందా.? ఆ పదవిలో ఉన్నాడో లేదో చెప్పాలని వైసీపీ నేతలను కేశినేని ప్రశ్నించారు.

అయితే బీజేపీ నేతలతో భేటి అయిన నిమ్మగడ్డకు సపోర్టుగా టీడీపీ ఎంపీ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ, బీజేపీ ఒకటేనా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
Tags:    

Similar News