వివాహేతర సంబంధాలు తన బలహీనతంట!

Update: 2016-12-20 12:30 GMT
కర్ణాటకకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీ మేటర్స్ తాజాగా బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యాయి. ఈయన గారి బలహీతనలు ఒకవైపు.. ఇంటిఎదుట ఆందోళనకు దిగిన భార్య ఒకవైపు. మరోవైపు కర్ణాటకలో బీజేపీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యాడ్యురప్ప గొడవ.. ప్రస్తుతం ఇవన్నీ బెంగళూరులో హాట్ టాపిక్స్ అయ్యాయి!

విషయానికొస్తే... కర్ణాటక రాష్ట్రంలోని ముదిగెరె అసెంబ్లీ స్థానం నుండి గతంలో ప్రాతినిథ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే కుమారస్వామి సతీమణి సవిత ఆయన ఇంటిముందు ఆందోళనకు దిగింది. ఇంతకూ కారణం ఏమిటని ఆరాతీస్తే విషయం వెలుగులోకి వచ్చిందట. తనకు వివాహేతర సంబంధాలు కొనసాగించడం బలహీనత అని, ఈ విషయాలపై తనను ప్రశ్నించకూడదని ఆయన తన భార్యను ఆదేశించాడట. ఇదే విషయమై ఆయనను గట్టిగా ప్రశ్నిస్తే ఆమెను కొట్టి బయటకు పంపాడట. దీంతో ఆయన ఇంటి ఎదుటే కూర్చొని నిరసనకు దిగింది కుమార స్వామి భార్య సవిత.

ఆమె వెర్షన్ అలా ఉంటే... తన భార్యే తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని ప్రత్యారోపణలు చేస్తున్నారు కుమార స్వామి. తనకున్న 30 ఎకరాల కాఫీ తోటను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని తన భార్య తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నాడు. ఆమె నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేస్తోంది. వీరిద్దరి గొడవ అలా ఉంటే... వీరి ఫ్యామిలీ పంచాయితీ పుణ్యమాని బిజెపి ప్రతిష్టకు దెబ్బకలుగుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, కుమారస్వామికి హితవు పలికారు. వీరి ఫ్యామిలీ పంచాయితీ తొందరగా తేల్చుకోవాలని కాస్త గట్టిగానే చెప్పారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News