టీడీపీ ఎంపీ గన్ మన్ సూసైడ్

Update: 2015-12-22 05:52 GMT
ప్రముఖులకు సన్నిహితంగా ఉండే వారు సూసైడ్ చేసుకోవటం ఆశ్చర్యకరంగా ఉంది. సాదాసీదా ప్రజలకు ప్రముఖుల దర్శన భాగ్యం కలగటమే కష్టం. అలాంటిది.. ప్రముఖులకు అత్యంత సన్నిహితంగా ఉంటూ.. వారి దగ్గర పని చేసే వారు ఆత్మహత్యలు చేసుకోవటం కాస్తంత చిత్రమైన విషయమే. ఇలాంటి ఘటనలు స్వల్ప వ్యవధిలో రెండుసార్లు చోటు చేసుకోవటం గమనార్హం.

తాజాగా ఉదంతంలో టీడీపీ ఎంపీ.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తెలుగుదేశం పార్టీ లోక్ సభ సభ్యుడు మాగంటి బాబు వద్ద గన్ మన్ గా పని చేస్తున్న 45 ఏళ్ల ఆదాం ఆత్మహత్య చేసుకోవటం కలకలాన్ని రేపుతోంది. ఏలూరు ఆర్మ్ డ్ రిజర్వేడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఆదాం చాలాకాలంగా బాబుకు గన్ మన్ గా పని చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనటానికి బాబు ఢిల్లీకి వెళ్లటంతో ఆయనకు సెలవు లభించింది.

ఈ సమయంలో అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. ఆదాం ఆత్మహత్య వెనుకున్న కారణాలు ఇంకా బయటకు రాలేదు. ఆదాం సతీమణి హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే తెలంగాణ మంత్రి హరీశ్ వ్యక్తిగత డ్రైవర్ ఒకరు ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. ఇలా ప్రముఖుల దగ్గర పని చేసే వారు.. ఆత్మహత్యలు చేసుకోవటం ఏమిటో..
Full View



Tags:    

Similar News