కిడ్నాప్ చేసి టాయిలెట్ సీటును నాలుకతో క్లీన్ చేయమన్నాడు

Update: 2019-08-09 03:46 GMT
ఇద్దరు పిల్లల పట్ల ఒక వ్యక్తి వ్యవహరించిన అమానుషం ఇప్పుడు సంచలనంగా మారింది. భూ వివాదంలో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ ఒక వ్యక్తి వ్యవహరించిన వైనానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ దారుణ ఉదంతంలోకి వెళితే..

మధ్యప్రదేశ్ కు చెందిన ముఖ్ యార్ ఖాన్ అనే వ్యక్తి దొంగ డాక్యుమెంట్లతో భూమి కొనుగోలు చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు. గతంలోనూ అతడిపై పలు కేసులు బుక్ అయ్యాయి. అతడు కొన్న భూమితో సంబంధం ఉన్న ఒక బడా బిజినెస్ మ్యాన్ కు చెందిన ఇద్దరు కుమారుల్ని కిడ్నాప్ చేశాడు. వారిని దారుణంగా హింసిస్తూ.. ఆ వైనాన్ని రికార్డు చేశాడు.

నకిలీ పత్రాలతో తాను కొన్నట్లుగా చెప్పిన భూమికి సంబంధించిన తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలంటూ హింసించాడు. బాత్రూం సీటును నాలుకతో శుభ్రం చేయాలని ఆదేశించాడు. అయితే.. అందుకు ఆ ఇద్దరు పిల్లలు ఒప్పుకోకపోవటంతో వారిని చితకబాదాడు. దీనికి సంబంధించి వీడియో బయటకు వచ్చి వైరల్ గా మారింది. దీంతో.. అలెర్ట్ అయిన పోలీసులు ముఖయార్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు.

తన కొడుకు హత్యలో ఆ  ఇద్దరు కుర్రాళ్లు ఉన్నారని చెప్పటంతో.. అనుమానం వచ్చిన పోలీసులు ఆ విషయం మీద విచారణ జరిపారు. అయితే.. ముఖ్ యార్ ఖాన్ చెప్పింది తప్పన్న విషయాన్ని  తేల్చారు. భూవివాదంలో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పేందుకు ఈ దుర్మార్గానికి పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News