వార్నాయ‌నో ఏంద‌య్యాఇదీః ప్రెస్ మీట్లో బుగ్గ గిల్లిన ఎంపీ.. సిగ్గుప‌డిన మ‌హిళా ఎమ్మెల్యే!

Update: 2021-03-10 07:30 GMT
ఓ ప‌క్క ప్ర‌త్య‌ర్థులు దూసుకొస్తున్నారు.. ఏం జ‌రుగుతుందో అనే ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెల‌కొంది.. చావో రేవో తేల్చుకోవాల్సిన ప‌రిస్థితి.. ఇలాంటి సంద‌ర్భంలో ఎవ‌రైనా ఏం చేస్తారు..? శ‌త్రువును ఎదుర్కోవ‌డానికి స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతారు క‌దా! కానీ.. ఈ ఎంపీగారు చూడండి.. ప‌బ్లిగ్గా అది కూడా ప్రెస్ మీట్లో కూర్చొని మ‌హిళా ఎమ్మెల్యే బుగ్గ‌ పిండేస్తున్నారు. ఈ సంఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

బెంగాల్లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ సారి ఎలాగైనా మ‌మ‌త‌ను ఓడించి, అధికారం చేప‌ట్టాల‌ని బీజేపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇందుకోసం శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. మ‌మ‌త కూడా ధీటుగా ఎదుర్కొంటోంది. మ‌ళ్లీ అధికారం త‌మ‌దేన‌ని చెబుతూ ఎన్నిక‌ల స‌మ‌రంలో పాల్గొంటోంది. కానీ.. ఆమె సైన్యం మాత్రం ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ టీఎంసీని అప్ర‌తిష్ట పాల్జేస్తోంది.

కొంద‌రు నాయ‌కుల‌తో క‌లిసి టీఎంసీ ఎంపీ క‌ళ్యాణ్ బెన‌ర్జీ ప్రెస్ మీట్ పెట్టారు. నేత‌లంతా వేదిక‌పై కూర్చున్నారు. వీరిలో బాన్‌ కురా మ‌హిళా ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అయితే.. మీడియా స‌మావేశంలోనే ఏదో విష‌య‌మై న‌వ్వుతూ స‌ద‌రు ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు ఎంపీ. ప‌బ్లిగ్గా ఇలా చేసినా.. ఆమె న‌వ్వుతూ ఉండ‌డం విశేషం.

ఈ వీడియోను బీజేపీ ఎంపీ లాకెట్ చ‌ట‌ర్జీ త‌న ట్విట‌ర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇది ఎక్క‌డ‌, ఎప్పుడు జ‌రిగింది అనే వివ‌రాల‌ను తెలియ‌జేయ‌లేదుగానీ.. ‘టీఎంసీ మహిళా సాధికారతకు నిదర్శనం’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది.
Tags:    

Similar News