జ‌గ‌న్ ఒక త‌త్వవేత్త‌, సిద్ధాంత‌వేత్త‌.. ఆ ఎంపీ కామెంట్స్ వైర‌ల్‌:

Update: 2022-08-02 11:49 GMT
బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్.కృష్ణ‌య్య త‌న‌కు రాజ‌కీయాలంటే ఇష్టం లేద‌ని చెబుతారు కానీ ఆయ‌న‌కు ప‌ద‌వీ కాంక్ష చాలా ఉంద‌ని తెలిసిన‌వాళ్లు చెబుతుంటారు. గ‌తంలో ఈ కాంక్ష‌తోనే టీడీపీ ఎమ్మెల్యేగా హైద‌రాబాద్ లోని ఎల్బీ న‌గ‌ర్ నుంచి గెలుపొందార‌ని గుర్తు చేస్తున్నారు. అలాగే 2018 ఎన్నిక‌ల్లో మిర్యాల‌గూడ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. అలాంటి కృష్ణ‌య్య‌ను వైఎస్ జ‌గ‌న్ ను ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేసి పెద్ద సాహ‌స‌మే చేశార‌ని అంతా అనుకున్నారు.

కృష్ణ‌య్య కూడా రాజ్య‌స‌భ ఎంపీ కాగానే బాగానే హ‌డావుడి చేస్తున్నారని చెబుతున్నారు. తాజాగా వ‌ర్ష‌కాల పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో కృష్ణ‌య్య బాగానే హ‌ల్ చ‌ల్ చేస్తున్నార‌ని అంటున్నారు.

దేశంలో వెనకబడిన వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలంటే కేంద్రం తక్షణమే బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిందేనని కృష్ణ‌య్య డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలో 72 మంత్రిత్వ శాఖలు ఉన్నాయ‌ని.. అలాంట‌ప్పుడు 75 కోట్ల జనాభా ఉన్న బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తే తప్పేంటని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.

బీసీల‌కు ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల‌ని త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీని కలిసి విన్నవిస్తామని ఆయ‌న చెబుతున్నారు. కేంద్రస్థాయి ఉద్యోగాల్లో, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరతామ‌ని తెలిపారు. బీసీలకు కేంద్ర బడ్జెట్‌లో కనీసంగా రూ.లక్ష కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తామ‌న్నారు.

బీసీల అభ్యున్నతికి వివిధ సంక్షేమ పథకాల సీఎం వైఎస్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నార‌ని కృష్ణ‌య్య కొనియాడారు. జగన్‌ నిర్ణయాలు ఓటుబ్యాంకు రాజకీయాల్లా కాకుండా ఒక తత్వవేత్త, సిద్ధాంతవేత్త తీసుకున్నట్లు ఉంటున్నాయన్నారు.

సామాజిక న్యాయం చేసేలా బీసీలకు రాజకీయ పదవుల్లో 50 శాతానికిపైగా కట్టబెట్టార‌ని ప్ర‌శంసించారు. మాటల్లో కాకుండా ఆచరణలో బీసీల సంక్షేమం కోసం ఏపీ సీఎం జగన్ చేస్తున్న కృషిని చూసి పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు ఆశ్చర్యపోతున్నారని కృష్ణ‌య్య సీఎంను ఆకాశానికెత్తారు.
Tags:    

Similar News