సీబీఐ కోర్టులో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. బెయిల్ ను రద్దుచేయించి ఎలాగైనా జగన్ను జైలుకు పంపాలని ఎంపి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అందుకనే ఒకటికి పదిరూపాల్లో కేసుల మీద కేసులు వేస్తున్నారు. ఈ కేసులోనే బుధవారం జరిగిన డెవలప్మెంట్ ఆశ్చర్యంగా ఉంది.
బెయిల్ రద్దు విషయంలో సీబీఐ వైఖరేంటో చెప్పాలని గతంలోనే కోర్టు దర్యాప్తు సంస్ధను కోరింది. అయితే బెయిల్ రద్దు విషయంలో తాము చెప్పటానికి ఏమీలేదని స్పష్టంచేసింది. బెయిల్ విషయంలో కోర్టు తన విచక్షణ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసింది. దీనికి ఎంపి తరపున లాయర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. సీబీఐ ఏదో ఓ నిర్ణయం చెప్పాల్సిందే అన్నారు. దాంతో కోర్టు మళ్ళీ ఇదే విషయాన్ని సీబీఐని రెండోసారి ప్రశ్నించింది.
రెండోసారి కూడా బెయిల్ విషయాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నట్లు మళ్ళీ స్పష్టంగా చెప్పింది. మళ్ళీ ఎంపి లాయర్ రెండోసారి కూడా అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో మూడోసారి విచారణ సందర్భంగా సీబీఐ సమాధానం చెప్పాలని కోర్టు అడిగింది. దాంతో తమకు పదిరోజుల గడువు కావాలని సీబీఐ లాయర్ అడిగారు. దీనికి ఎంపి లాయర్ అభ్యంతరం చెప్పి వెంటనే సమాధానం తీసుకోవాలన్నారు. అయితే ఎంపి లాయర్ అభ్యంతరాన్ని పట్టించుకోకుండా కోర్ట పదిరోజుల గడువిచ్చింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అక్రమాస్తుల కేసుల్లో సాక్ష్యులను జగన్ ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపించిన ఎంపినే ఆధారాలను కూడా చూపించాలి. కానీ ఆ పని చేయకుండా సీబీఐ కూడా బెయిల్ రద్దు చేయాలని కోరుతు అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుకుంటున్నారు. జగన్ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నట్లు సీబీఐ భావించలేదు. అందుకనే బెయిల్ నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేసింది.
అయితే ఎంపి లాయర్ మాత్రం పదే పదే సమాధానం చెప్పాల్సిందే అని సీబీఐని అడగటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బెయిల్ రద్దు చేయించాల్సిన అవసరం రఘురామకు ఉందేకానీ సీబీఐకి ఏమీలేదు. జగన్ మీద నమోదైన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమే అని అందరికీ తెలుసు. చివరకు బెయిల్ విషయం కూడా రాజకీయం అయిపోవటమే విచిత్రంగా ఉంది.