వైసీపీ పీకల్లోతు కష్టాల్లో ఉందిపుడు. రాజకీయాల్లో ఏ చిన్న విషయం అయినా కూడా దెబ్బ తీసే పరిస్థితి ఎపుడూ ఉంటుంది. దాన్ని సొమ్ము చేసుకునే బలమైన ప్రతిపక్షం ఉన్న చోట వైసీపీ విలవిలలాడం తప్ప చేసేది లేదనే చెప్పాలి. ఇదంతా ఎందుకు అంటే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం.
దాని మీద విపక్షాలు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాయువేగంతో రియాక్ట్ అయింది. మొత్తం రోజంతా ఇదే టాపిక్ ని అటు సోషల్ మీడియాలోనూ ఇటు టీవీ చానళ్ళలోనూ లైవ్ లో ఉంచడంతో టీడీపీ సక్సెస్ అయింది. అదే సమయంలో గోరంట్ల పుణ్యమాని పాత మాటలు, నాటి నేతల నోటి మాటలు కూడా మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
గంట అరగంట అంటూ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు ఆడియోలు కూడా సామాజిక మాధ్యమల్లో రీ రిలీజ్ అయి సూపర్ హిట్ అవుతున్నాయి. ఇక వైసీపీకి కంట్లో నలుసుగా మరి ప్రతీ రోజూ ఢిల్లీ వేదికగా రచ్చబండ పెట్టి ఏకేస్తున్న రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజుకు ఇవన్నీ చూస్తే అసలు ఆగబుద్ధి వేస్తుందా.
పైగా ఈ గోదావరి రాజు గారి తనదైన వెటకారం డాట్ కమ్ తో మన పార్టీ అంటూనే వైసీపీ పరువు తీస్తారాయే. అందుకే ఆయన సెటైరికల్ గా అంటున్న మాటలు ఇస్తున్న స్టేట్మెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఉదయం నుంచి గంట అరగంట, నిలబడ్డ గంట అంటూ సోషల్ మీడియాలో చంపేస్తున్నారు అంటూ చేసిన కామెంట్స్ వైసీపీకి ఎక్కడ తగలాలో అక్కడ తగులుతున్నాయి.
అంతేనా రాజు గారి మరో అడుగు ముందుకేసి గోరంట్ల మీద విరుచుకుపడ్డారు. అసలు సుప్రీం కోర్టుకు గోరంట్ల వీడియోలకు ఏంటి సంబంధం అని కూడా లాజిక్ పాయింట్ తీస్తున్నారు. ఈ విషయంలో సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తానని మాధవ్ చెప్పడమేంటి అని ప్రశ్నించారు. అంతే కాదు మాధవ్ వీడియోను, అంబటి, అవంతిల ఆడియో టేపులను అర్జంటుగా ఫోరెన్సిక్ కి ఇవ్వాలని రాజు గారు తనదైన శైలిలో డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి వైసీపీ అడ్డంగా దొరికేసి రాజా వారి వెటకారానికి బలి అవుతోందిగా. పీక్కో లేక లాక్కోలేక పెద్ద తలకాయలు అన్నీ కూడా సైలెంట్ అవుతున్నారుగా అంటున్నారు.