మా ఆయనకు సోరియాసిస్సా? నాకు తెలియదే? ఆర్​ఆర్​ఆర్​ భార్య షాక్​..!

Update: 2021-05-17 07:30 GMT
గత రెండు మూడు రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఆర్​ఆర్​ఆర్​ ( నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ) వ్యవహారం హాట్​టాపిక్​గా మారిన విషయం తెలిసిందే. చాలా రోజులుగా ఆర్ఆర్​ఆర్​ ఏపీ ప్రభుత్వంపై ఓ రేంజ్​లో విరుచుకుపడుతున్నారు. అయితే ఇటీవల డోసు మరీ పెంచారు. ముఖ్యంగా ఓ రెండు మీడియా చానల్స్​లో ఆయన మాటలకు అడ్డుఅదుపులేకుండా పోయాయి. గతంలో ప్రభుత్వ విధానాలపై మాట్లాడే రఘురామ  ఇటీవల ఏకంగా వ్యక్తిగత దూషణలకు దిగారు.

నేరుగా సీఎం జగన్​ మోహన్​రెడ్డిని ఆయన కులాన్ని.. వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్​ చేస్తూ కనిపించారు. టీడీపీకి అనుకూలంగా ఉండే రెండు మీడియా చానల్స్ కూడా వీటిని ప్రముఖంగా ప్రసారం చేశాయి.మరోవైపు సోషల్​ మీడియాలోనూ రఘురామ​కు అనుకూలంగా వ్యతిరేకంగా పోస్టులు వెల్లువలా వచ్చాయి. రఘురామ​ వ్యవహారంపై  ఏపీ ప్రభుత్వం చాలా రోజులు వేచి చూసింది. చివరకు ఆయన  వ్యవహార శైలి శృతిమించడంతో ఇటీవల ఏపీ సీఐడీ పోలీసులు రఘురామ​ను అదుపులోకి తీసుకొన్నారు. ఆయనపై కొన్ని బలమైన సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టారు.

ఇదిలా ఉంటే రఘురామ కృష్ణం రాజు బెయిల్​ పిటిషన్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ పిటిషన్​ను ధర్మాసనం తిరస్కరించడంతో తనను సీఐడీ పోలీసులు కొట్టారని.. తన కాళ్లకు గాయాలయ్యాయని ఏకంగా న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు ఈ అంశాన్ని సీరియస్​గా తీసుకున్నది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను ఆదేశించించింది.డాక్టర్ల బృందం రఘురామ కృష్ణం రాజుకు పరీక్షలు నిర్వహించింది. ఆయనపై పోలీసులు దాడి చేయలేదని తేల్చి చెప్పింది. ఆయనకు సొరియాసిస్​ లాంటి చర్మ వ్యాధి ఉందని.. అందుకే పాదాలు కమిలిపోయాయని డాక్టర్లు చెప్పారు.

అయితే ఈ విషయంపై
ర‌ఘురామ కృష్ణంరాజు స‌తీమ‌ణి రమాదేవి ఓ టీవీ చానల్ లో మాట్లాడారు. ‘ మా ఆయనకు సొరియాసిస్​ ఉండే  అవకాశమే లేదు. ఒకవేళ ఉంటే ఇన్నేళ్ల మా కాపురంలో నాకు తెలుస్తుంది కదా’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు తన భర్తను హత్యచేసేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆమె ఆరోపణలు చేశారు. ఈ కేసు ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
Tags:    

Similar News