ఏ పార్టీ బొమ్మ మీద గెలిచారో.. అదే పార్టీ మీదా.. పార్టీ అధ్యక్షుడి మీద ఘాటు వ్యాఖ్యలు చేసే ఉదంతాలు చాలా తక్కువగా ఉంటాయి. అందునా.. డైలీ బేసిస్ లో రచ్చబండ పేరుతో విలేకరుల సమావేశాన్ని నిర్వహించటం.. లేదంటే వీడియోను రికార్డు చేసి.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చ చేసే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు తరచూ రాజకీయ సంచలనంగా ఉంటారు. అలాంటి రఘురామను ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేయటం.. ఆ సందర్భంగా తనను తీవ్రంగా హింసించినట్లుగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇంతకీ సీఎం జగన్మోహన్ రెడ్డికి.. ఎంపీ రఘురామకు మధ్య గ్యాప్ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అన్నది ఎప్పుడూ ప్రశ్నే. ఇదే విషయం మీద క్లియర్ గా రఘురామ ఎప్పుడూ చెప్పింది లేదు. తాజాగా ఆయనో టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూను చూసినప్పుడు అధినేత జగన్ తో ఆయనకు తేడా రావటానికి కారణాల్ని చూస్తే.. మూడు ఉదంతాలుగా చెప్పాలి. ఇంతకూ అంతలా తేడా కొట్టిన ఆ మూడు ఉదంతాల్ని రఘురామ మాటల్లోనే చూస్తే..
మొదటిది
నన్ను పార్లమెంటు లెజిస్లేషన్ సబార్డినేట్ కమిటీకి అధ్యక్షుడిగా నియమించారు. జగన్‌కు థ్యాంక్స్ చెప్పాలని, అపాయింట్‌మెంట్ తీసుకుని నా ఎత్తులో సగం ఎత్తున్న ఒక పెద్ద బొకే చేయించుకుని ప్రత్యేక విమానంలో వచ్చాను. తీరా వచ్చిన తర్వాత... అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ అయినట్లు చెప్పారు. ఫోన్‌లో మాట్లాడేందుకూ ఇష్టపడలేదు. చాలా అవమానంగా ఫీలయ్యాను. ఇంత పెద్ద బొకే తెచ్చాను కదా! దీనిని ఇతని కంటే పెద్దవ్యక్తికి ఇవ్వాలని అనుకున్నా. వెంటనే గవర్నర్ కార్యాలయానికి ఫోన్ చేసి సమయం అడిగాను. అప్పటికప్పుడు గవర్నర్ సమయం ఇచ్చారు. ఆ బొకేను తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చాను.
ఈ బొకే తంతు జరిగిన తర్వాతే సభలో నేను తెలుగుపై మాట్లాడాను. ఆయన తండ్రి వైఎస్.. నేను చాలా క్లోజ్. ఆయన సీఎం కాకమునుపు... పులివెందుల వాళ్లకు ఏదైనా పని కావాల్సి వస్తే వెంటపడేవారు. ‘‘మీరు నాకు మళ్లీ ఫోన్ చేయకండి. నేను పని పూర్తి చేసి కాల్ చేస్తాను’’ అని చెప్పగలిగే చనువు వైఎస్‌తో ఉండేది. అలాంటిది, నేను అంత ఖర్చు పెట్టుకుని కృతజ్ఞతలు చెబుదామని వస్తే నా ముఖం చూడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అది నాకు మంట కలిగించదా!
రెండోది
రాజ్యాంగంలోని ఆర్టికల్ 350ఏ ప్రకారం ప్రాథమిక విద్యను మాతృభాషలో చదువుకునే అవకాశం ఉండాలి. అన్ని రాష్ట్రాలూ తప్పనిసరిగా ఈ అధికరణను అనుసరించేలా చూడాలని విద్యా శాఖ మంత్రిని కోరాను. అప్పుడు ‘అన్నా అదరగొట్టావ్’ అని మిథున్ రెడ్డి కూడా ప్రశంసించారు. వాళ్లకి అప్పుడు అర్థం కాలేదు. ఆ రాత్రికే సీన్ మారిపోయింది. నా మీద సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు బ్రేకింగ్ వచ్చింది. సుబ్బారెడ్డిని పిలిచి రఘురామరాజును సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశించారని వార్తల్లో వచ్చింది. ‘సరే ఏం చేస్తాం’ అనుకున్నా. తెలుగు గురించి మాట్లాడినందున నన్ను తక్షణం తన ముందు ప్రవేశపెట్టమని సీఎం ఆజ్ఞాపించడం జరిగింది.
ఆ తర్వాత ఒక గురువారం మిథున్ రెడ్డి వచ్చి, ‘నీకు తాఖీదు వచ్చింది సీఎం రమ్మన్నారు. వెళదాం’ రమ్మన్నారు. ఎందుకు ఇలా మాట్లాడావని అడిగారు. నేను రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్ గురించి చెప్పానని తెలిపాను. నిజానికి భాష మీద టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్న వచ్చింది. అప్పటికప్పుడు నేను అనుబంధ ప్రశ్న అడిగా ను. నాకు అవకాశం రావడంతో మాట్లాడానని చెప్పాను. రాష్ట్రం లో ఇలా తెలుగు తీసేస్తున్నారని చెప్పలేదని కూడా వివరించాను. దాంతో ఇలాంటివి రిపీట్ కాకూడదని జగన్ అన్నారు.
మూడోది
తిరుపతి వెంకన్న స్వామి భూములు అమ్మేయాలన్నప్పు డు దానం చేసిన వారిని సంప్రదించి, వారు సమ్మతిస్తే అమ్మేయండి అని సూచించాను. ఒక భక్తుడిగా కొంచెం గట్టిగానే చెప్పాను. ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత ఒక జాతీయ మీడియా ఇంటర్వ్యూ లో మోహన్ దాస్ పాయ్‌తో మాట్లాడే సందర్భంలో ఈ టాపిక్ వచ్చింది. దానికి అనుబంధంగా క్రైస్తవం మీద చర్చ సాగింది.