జగన్ ఢిల్లీకొస్తే రాజీనామాకు రెడీ అన్న రఘురామరాజు

Update: 2021-08-04 17:30 GMT
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు సంచలన సవాల్ విసిరారు. తన రాజీనామాపై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తామనడాన్ని స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు.

విశాఖ ఉక్కు కోసం తాను కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. టీడీపీతోపాటు వైసీపీ ఎంపీలు కూడా కలిసి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని పిలుపునిచ్చారు. అలాగే సీఎం వైఎస్ జగన్ కూడా ఢిల్లీ వచ్చి విశాఖ ఉక్కు కోసం పోరాడితే చాలా బాగుంటుందని సూచించారు.

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా కంపెనీ తరలిపోవడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ చెరో మాట మాట్లాడుతున్నారని ఎంపీ రఘురామరాజు తప్పు పట్టారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డియే స్వయంగా అమర్ రాజా కంపెనీకి అదనపు భూ కేటాయింపులు చేశారని గుర్తు చేశారు. అప్పుడు లేని తప్పులు ఇప్పుడు ఎలా కనపడ్డాయని రఘురామ ప్రశ్నించారు.

ఇక రాష్ట్రంలో అన్ని శాఖల గురించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. సజ్జల విశృంఖలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాగే ఎంపీ గోరంట్ల మాధవ్ తనను అంతు చూస్తా అన్నందుకు ఆయన్ను అభినందించారని తెలిసిందని.. ప్రెస్ మీట్ పెడితే లేపేస్తారా? అని రఘురామ ప్రశ్నించారు. మీ పిచ్చి ఉడుత ఊపులు ఊపకండని ఎద్దేవా చేశారు. తాను చేస్తోంది ధర్మ పోరాటమని స్పష్టం చేశారు.

రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని తాను కేంద్రానికి ఫిర్యాదు చేస్తే ఆర్థిక అధికారులను సస్పెండ్ చేశారని రఘురామ పేర్కొన్నారు. ఆర్థిక అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి లేఖ రాసింది తీసుకోవాలని ప్రధాని మోడీకి లేఖ రాసింది తానేనని రఘురామ రాజు వెల్లడించారు.
Tags:    

Similar News