కాంగ్రెస్ పార్టీ కీలకనేత - ఫైర్ బ్రాండ్ - మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రతి క్షణం రాజకీయాలతో బిజీగా ఉంటారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంపై - సీఎం కేసీఆర్ పై - మంత్రి కేటీఆర్ పై పదునైన విమర్శలు - ఆరోపణలతో ఫైర్ అవుతుంటారు. అలాగే ఈ మద్యే మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ పై అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఎగురవేసినందుకు గాను కొన్ని రోజులు జైలు జీవితం గడిపి ఈ మద్యే బయటకి వచ్చాడు. జైలు నుండి బయటకి వచ్చిన కొన్ని గంటలకే తన స్టైల్ లో ప్రభుత్వం పై విరుచుకుపడిన రేవంత్ రెడ్డి ..ప్రస్తుతం తన ఇంట్లో తీరిగ్గా - ఇంట్లో వారి కోసం చికెన్ వండుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
అదేంటి రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్ కి చికెన్ వండేంత టైమ్ కూడా ఉంటుందా ? అంటే మాములుగా అయితే ఉండదు. కానీ , ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించిన నేపథ్యంలో ..మన దేశంలో కూడా వేగంగా విస్తరించడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. దీనితో అత్యవసరం అయితే తప్ప , ఎవరు కూడా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో నుండి బయటకి రాకూడదు.
దీనితో ఇన్ని రోజులు రాజకీయాలతో ఫుల్ బిజీ బిజీగా గడిపిన నేతలందరూ కూడా ..ఈ లాక్ డౌన్ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. దీనితో రేవంత్ రెడ్డి కూడా ..కిచెన్ లో దూరి తన ఫ్యామిలీ కోసం వంట వండటం మొదలుపెట్టాడు. ప్రస్తుతం రాజకీయ నేతలు కేవలం సోషల్ మీడియా ద్వారా ఇంటి లోపల ఉండాలని ప్రజలను కోరడం మినహా, ఎవరు కూడా బయటకి రావడంలేదు. మొత్తంగా నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే ..రాజకీయ నాయకులకి ఈ కరోనా ఒక విదంగా హెల్ప్ చేస్తుందనే చెప్పవచ్చు. కరోనా పుణ్యమా అని రాజకీయ నేతలు చాలా రోజుల తరువాత తమ కుటుంబంతో హాయిగా కాలక్షేపం చేస్తున్నారు.