ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నంతనే చాలా సుపరిచితమైన పేరన్న భావన తెలంగాణలోని చాలామందికి కలుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా.. ఆ మాటకు వస్తే ఎప్పుడూ పక్కన ఉండే ఆయనకు గులాబీ అధినేత ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు? అత్యంత విశ్వసనీయుడిగా ఆయన్ను ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు? తన కంటే చిన్నదైన కవితను అక్కా అని ఎందుకు పిలుస్తారు? అమెరికా వీసా కోసం యత్నించి రిజెక్ట్ అయిన అతగాడు ఇప్పుడు డిప్లమాటిక్ వీసాను సొంతం చేసుకున్న స్థాయికి ఎలా ఎదిగారు? లాంటి విషయాల్ని సంతోషే చెబితే? గ్రీన్ ఛాలెంజ్ పేరుతో ఐదు కోట్ల మొక్కలు నాటటానికి కారణమైన ఆయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలెన్నో చెప్పుకొచ్చారు. అందులో కొన్నింటిని చూస్తే.. సంతోష్ లోని మరో కోణం కనిపిస్తుంది.
సంతోష్ కేసీఆర్ సతీమణి తరఫు బంధువు. కేటీఆర్ కు తమ్ముడు వరుస అయ్యే బంధువు. వయసులో చూస్తే కవిత కంటే పెద్ద. కానీ.. మొదట్నించి ఆమెను అక్కా అని పిలవటం అలవాటు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ.. నిత్యం ఆయన వెంటూ ఉంటూ.. ఆయన బాగోగులు చూస్తున్నారు గడిచిన పందొమ్మిదేళ్ల నుంచి.
కరీంనగర్ జిల్లాలోని కొండూరుపాకలో పుట్టి పెరిగిన సంతోష్ కు ఊరంటే చాలా ఇష్టం. కానీ.. మిడ్ మానేరు ప్రాజెక్టు ఏర్పాటులో ఊరు మునిగిపోయింది. ఆయన తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. గ్రామస్థాయి రాజకీయ నాయకులుగా పేరుంది. డాక్టర్ కావాలనేది సంతోష్ కోరిక. అందుకే యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ కష్టపడి చదవటం ద్వారా తాను అనుకున్నది సాధించాలనుకునేవారు. అందుకే కష్టమైనా బైపీసీ తీసుకున్నా డాక్టర్ మాత్రం కాలేకపోయారు. దీంతో ఫూణెలో ఎంబీఏ చేశారు. ఆ టైంలో అన్న కేటీఆర్ తో కలిసి ఉండేవారు. తన జీవితంలో ఫూణెలో గడిపిన రోజులు గోల్డెన్ డేస్ గా చెబుతారు.
హైదరాబాద్ లో జాబ్ చేసిన టైంలో కేసీఆర్ ఇంట్లోనే ఉండేవారు. అప్పటికే కేటీఆర్.. అక్క కవిత.. తన సోదరి సౌమ్యలు అమెరికాకు వెళ్లటంతో తాను డాలర్ డ్రీమ్స్ లో ఉండేవారు. అందులో భాగంగా టెస్టింగ్ టూల్స్ నేర్చుకున్నారు. వీసా అప్లై చేసిన టైంలోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఉగ్రదాడి జరగటంతో ఆయన వీసా రిజెక్టు అయ్యింది. అదే టైంలో.. కేసీఆర్ కలుగజేసుకొని అందరూ అమెరికాకు వెళ్తే.. మమ్మల్ని చూసుకునేటోళ్లు ఎవరు? నువ్వు ఇక్కడే ఉండిపో అనటంతో ఓకే చెప్పేశారట.
అలా 2000 నుంచి 2006 వరకూ అనుక్షణం ఆయన కేసీఆర్ తోనే ఉండిపోయారు.కేటీఆర్.. కవితలు అమెరికా నుంచి తిరిగి వచ్చేసినా.. కేసీఆర్ కు మాత్రం సంతోష్ అంటే ఎంతో ప్రేమని చెబుతారు. కేసీఆర్ నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకూ ఆయనకు సంబంధించిన అన్ని బాగోగుల్ని చూసుకుంటారు సంతోష్. దీక్ష వేళలో కేసీఆర్ పక్కనే ఉన్నారు సంతోష్. కేంద్రమంత్రిగా ఉన్న టైంలో కేసీఆర్ ఒకసారి బాత్రూంలో జారి పడ్డారు. దీంతో ఆయనకు సర్జరీ చేయాల్సి వచ్చింది. అప్పట్లో దాదాపు రెండు నెలల పాటు ఆయన బాగోగులన్ని సంతోషే చూసుకున్నారు.
ఆ టైంలో సంతోష్ తో.. నీ ఫ్యూచర్ కు నేను ఆటంకం అవుతున్నానా? అని పెద్దనాన్న అడగటంతో ఆ మాటలకు తాను ఏడ్చేసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. అదేం లేదని.. పెదనాన్నకు సేవ చేసే అవకాశం లభించిందని తాను చెప్పినట్లు చెప్పారు. ఇప్పటికి నెలలో రెండుసార్లు అయినా కేసీఆర్ తనను తిడుతూనే ఉంటారని సంతోష్ చెబుతారు. ఒకప్పుడు యూఎస్ వీసా రిజెక్టు అయిన సంతోష్.. ఎంపీగా ఇప్పుడు డిప్లమాటిక్ పాస్ పోర్టు ఉందని.. దాదాపు 95 దేశాలకు వీసా అవసరం లేకుండానే నేరుగా వెళ్లొచ్చని చెబుతారు.
ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రోహిణితో పెళ్లికి ముందు నుంచే తెలుసన్నారు. తాను తెచ్చిన పెళ్లి ప్రపోజల్ కు ఆమె వెంటనే ఓకే చెప్పలేదని.. ఇంట్లో మాట్లాడి చెబుతానని మూడు గంటలు వెయిట్ చేసిన తర్వాత ఓకే చెప్పిన వైనాన్ని గుర్తు చేసుకుంటారు. ఆ టైంలో తన కంటే తన ఫ్రెండ్స్ ఎక్కువ టెన్షన్ పడ్డారని చెబుతారు. ఇప్పుడు తమకు ఇద్దరు మగ పిల్లలని.. ఇషాన్.. శ్రేయాన్ అని చెబుతారు. తాను స్ట్రిక్ట్ ఫాదర్ ను కాదంటారు.
చిన్నతనంలో తనకు.. కవితకు అన్న కేటీఆర్ మాట అంటే వేదవాక్కు అని చెబుతాడు. కేటీఆర్ ఏం చెబితే అది తూచా తప్పకుండా తాము ఫాలో అవుతామని చెబుతాడు. ఎంపీ అయ్యాక జీవితం కొద్దిగా మారుతుంది. కానీ.. నువ్వు ఇప్పటిలానే ఉండమని కేటీఆర్ సలహా ఇచ్చారన్నారు. తన చిన్నతనంలో కడుపునొప్పితో బాధపడేవాడినని.. అది అపెండిక్స్ గా గుర్తించి ఆపరేషన్ కోసం తనను నీలోఫర్ కు తీసుకెళ్లారన్నారు.
ఆసుపత్రిలో చేరిన పక్కరోజు మధ్యాహ్నం డాక్టర్లు ఆపరేషన్ చేస్తామంటే దానికంటే ముందే అపెండిక్స్ పగిలిపోయి.. అది కాస్తా శరీరం మొత్తం వ్యాపించిందని.. అప్పటికే ఎమ్మెల్యే అయిన కేసీఆర్ తనను చూసేందుకు వచ్చి.. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పటంతో తాను బతికినట్లు చెబుతారు. పెద్దనాన్న వల్లే తాను బతికానని.. లేదంటే ఆ రోజునే చనిపోవాల్సిందని చెబుతాడు. ఇదంతా విన్నప్పుడు సంతోష్ ను ఎంపీ చేయటానికి కేసీఆర్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారో ఇట్టే అర్థం కాక మానదు.