ఆ డైర‌క్ట‌ర్ మాటలు గ‌డ్డిపోచ‌తో స‌మానం

Update: 2018-02-12 10:50 GMT
ఏదో ఒక అంశంపై ట్వీట్ చేస్తూ ర‌చ్చ‌చేసే వ‌ర్మ ఈ సారి టీడీపీ ఎంపీల‌ను జోక‌ర్లుగా అభివ‌ర్ణిస్తూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ పై టీడీపీ ఎంపీ శివ‌ప్ర‌సాద్ స్పందించారు. టీడీపీ ఎంపీ శివ‌ప్రసాద్ అఘోరా వేష‌దార‌ణ‌లో ఆందోళ‌న చేస్తుండంగా , మ‌రికొంత‌మంది ఎంపీలు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఉన్న ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ వారిని జోక‌ర్ల‌ని అని అన్నాడు. అంతేకాదు  ఇలాంటి జోక‌ర్లును చూసే పీఎం మోడీ ఏపీని ఓ జోక్ గా భావిస్తున్నాడ‌ని అన్నాడు. వీరు జోకర్లకు తక్కువ’ అంటూ తెలుగు దేశం పార్టీ పరువును జాతీయ స్థాయిలో అవమానానికి గురి చేస్తున్నారు’ అంటూ వెటకారంగా మరో ట్వీట్‌ చేశాడు.

అయితే ఆర్జీవీ ట్వీట్ పై ఓ మీడియా ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన శివ‌ప్రసాద్ ఆయ‌న‌ మాటల్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌సరం లేద‌ని అన్నారు. ఎప్పుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ పేరు సంపాదించుకోవ‌డం ఆర్జీవీకి అలవాటేన‌ని సూచించారు.  వెంక‌న్న‌, దుర్గ‌మ్మ సాక్షిగా పీఎం మోడీ  రాష్ట్రానికి అన్యాయం పై ప్ర‌శ్నిస్తుంటే మ‌ద్ద‌తు ప‌ల‌క‌కుండా త‌మ‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం త‌గ‌ద‌ని అన్నారు.

ఈ సంద‌ర్భంగా తాను విచిత్ర వేషాద‌ర‌ణ‌లో ఎందుకు నిర‌స‌న వ్య‌క్తం చేస్తారో చెప్ప‌క‌నే చెప్పాడు. పార్ల‌మెంట్ లో 28రాష్ట్రాల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ జ‌రిగే స‌మ‌యంలో ఏపీకి జ‌రిగిన అన్యాయాన్ని అంద‌రికి తెలియాలంటే ప్ల‌కార్డులు ప‌ట్టుకొని, మైకుల్లో మాట్లాడితే స‌రిపోద‌ని ,ఈ త‌ర‌హా వేష‌దార‌ణ వేయ‌డంతో రాష్ట్ర స‌మ‌స్య‌లు అంద‌రికి తెలుస్తున్నాయ‌ని , త‌మ స‌మ‌స్య‌ల‌పై ఇత‌ర పార్టీల ఎంపీలు కూడా మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ని అన్నారు. అందరి దృష్టినీ ఆకర్షించేందుకు విభిన్నంగా ప్రవర్తించాల్సిందేనని తెలిపారు.

ఇక రాంగోపాల్ వ‌ర్మ బిరుదుల్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న శివ‌ప్రసాద్ ...బీజేపీని న‌మ్మే పరిస్థితిలేదు.పోరాటం కొన‌సాగుతుంద‌ని పున‌రుద్ఘాటించారు.  తమను విమర్శించడం ద్వారా మరో విధమైన ప్రచారాన్ని వర్మ కోరుకుంటున్నట్టు అనిపిస్తోందని విమర్శించారు. అలా కాకుండా, ఆయన తన తెలివిని ఉపయోగించి ఓ ఐడియా ఇస్తే, తాను చేస్తానని చెప్పారు.

ఇదిలా ఉంటే టీడీపీ నేత‌ల‌పై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. రాష్ట్రానికి ఏ రంగానికి ఎన్నినిధులు ఇచ్చామో ఆ పార్టీకి చెందిన అగ్ర‌నాయ‌కులు వివ‌రించినా టీడీపీ ఎందుకు రాద్దాంతం చేస్తుందో అర్ధంకావ‌డం లేద‌ని  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ కిషోర్ దుయ్య‌బ‌ట్టారు.

కేంద్ర‌ప్ర‌భుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల‌పై తెలుగుత‌మ్ముళ్లు బ‌హిరంగ చ‌ర్చ‌కు వ‌స్తారా అని ప్ర‌శ్నించారు. మిత్ర ధ‌ర్మం పాటించిన టీడీపీ నేత‌లు రాజకీయ అవసరాల కోసమే బీజేపీపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని అభిప్రాయ‌ప‌డ్డారు. తామిచ్చిన ల‌క్ష‌కోట్ల‌కి లెక్క‌లు చూపిస్తాం. ఆ లెక్క‌లు అవాస్థ‌వ‌మ‌ని నిరూపించేందుకు  టీడీపీ నాయకులు సిద్ధంగా  ఉన్నారా..? అని ప్ర‌శ్నానాస్త్రాలు సంధించారు.  

Tags:    

Similar News