ఏపీ ప్రభుత్వానికి అదిరిపోయే రితీలో జలక్ ఇచ్చారు బీజేపీ సీనియర్ నేత - ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. ప్రపంచంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల పలు అక్రమాలు బయటపడ్డ సంగతి తెలిసిందే.. దేవుడి ఆభరణాల విషయంలో మాజీ ప్రధానాచార్యులు పలు ఆరోపణలు గుప్పించారు. దీంతో టీటీడీ వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీనిపై కేంద్రంలోని బీజేపీ కూడా ఫోకస్ చేసింది.
ఈ నేపథ్యంలోనే ప్రముఖ న్యాయవాది - బీజేపీ ఎంపీ అయిన సుబ్రహ్మణ్య స్వామి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. టీటీడీని ఏపీ ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలంటూ పిటీషన్ లో కోరారు. హైదరాబాద్ కు చెందిన లా విద్యార్థి సత్య సబర్వాల్ తో కలిసి ఈరోజు ఈ పిటీషన్ దాఖలు చేసినట్టు సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు..
ఇప్పటికే టీటీడీ అక్రమాలపై సుప్రీం కోర్టులో స్వామి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీం తిరస్కరించింది. ఇది స్థానిక అంశమైనందున కలుగజేసుకోమని.. కావాలంటే హైకోర్టులో పిటీషన్ వేయాలంటూ స్వామికి సూచించింది. ఈ నేపథ్యంలోనే స్వామి తాజాగా ఉమ్మడి ఏపీ హైకోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పు కనుక తేడా కొడితే ఏపీ ప్రభుత్వం ఇరుకున పడడం ఖాయంగా కనిపిస్తోంది.