షాక్: జూమ్ వీడియో కాల్ లో ఎంపీ నగ్నావతారం

Update: 2021-04-16 11:30 GMT
కరోనా చాలా అనర్థాలకు కారణమవుతోంది. నలుగురిని ఒక్కచోట కూర్చొని హాయిగా మాట్లాడుకోనివ్వడం లేదు. కలిసి ఎంజాయ్ చేయనీయడం లేదు. సమావేశాలు,సభలకు కాలం చెల్లింది. ఇప్పుడు అంతా ఆన్ లైన్ జూమ్ మీటింగ్ లే.. ఇలా వీడియో ఆన్ లో ఉందని తెలియక ఒక ఎంపీ అడ్డంగా నగ్నంగా బుక్కయ్యాడు.కరోనా కల్లోలంతో అందరూ ఇంటినుంచే పనిచేస్తున్నారు. సమావేశాలన్నీ జూమ్ ఆన్ లైన్ లో సాగుతున్నాయి. తాజాగా కెనడా దేశంలో కూడా ఓ ఎంపీ విలయం ఆమోస్ ఇలా జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్నాడు.

తాజాగా జూమ్ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఎంపీ విలియం ఆమోస్.. తన కంప్యూటర్ లోని కెమెరా ఆన్ లో ఉందనే సంగతి మరిచిపోయాడు. దీంతో నగ్నంగా కెమెరా ముందుకు వచ్చాడు. ఈ మీటింగ్ ప్రజలకు టెలికాస్ట్ కాకపోవడంతో బతికిపోయాడు.అయితే కొందరు దీన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. సదురు ఎంపీ విలయం పరువు పోయింది. విలయం నగ్న రూపాన్ని తోటి ఎంపీలంతా చూశారు.

ఈ ఘటనపై ఎంపీ బహిరంగ క్షమాపణ చెప్పాడు. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు అని.. జాగింగ్ కు వెళ్లి వచ్చిన తర్వాత మీటింగ్ కోసం దుస్తులు మార్చుకుంటున్న సందర్భంలో నా కెమెరా అనుకోకుండా ఆన్ అయ్యిందని తెలిపారు. తన తప్పిదానికి నా తోటి ఎంపీలకు క్షమాపణలు తెలియజేస్తున్నట్టు తెలిపాడు. కానీ ఇప్పుడు ఎంపీ ఫొటోలు వైరల్ అయిపోయి ఆయన పరువు పోయింది.

https://twitter.com/AndrewSaysTV/status/1382476411190059014?s=20
Tags:    

Similar News